spot_img
Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన 'జన నాయగన్'..ఎంత గ్రాస్...

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి వస్తున్న మొట్టమొదటి చిత్రం , ఇదే చివరి చిత్రం కూడా. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది , ఓపెనింగ్స్ లో సెన్సేషన్ సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ముందుగా 100 కోట్ల నుండి 140 కోట్ల వరకు గ్రాస్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కనీసం 80 కోట్ల గ్రాస్ కూడా వచ్చేలా కనిపించడం లేదు.

ఓవర్సీస్ లో విజయ్ రేంజ్ బుకింగ్స్ అసలు జరగడం లేదు. జనవరి 9 న విడుదల అన్నప్పుడు ఈ చిత్రానికి రెండు రోజులకు ముందు 4 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. కానీ ఇప్పుడు రేపు విడుదల అనగా, కనీసం 2 మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా రాలేదు. దాదాపుగా 60 శాతం కి పైగా తేడా కనిపిస్తోంది. కేవలం ఓవర్సీస్ లోనే కాదు , తమిళనాడు లో కూడా ఇదే పరిస్థితి. విజయ్ గత చిత్రాలు అయినటువంటి లియో , ది గోట్ , బీస్ట్ వంటి చిత్రాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా విడుదలకు ముందు 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యేవి. కానీ ‘జన నాయగన్’ చిత్రానికి ఇప్పటి వరకు 12 కోట్ల 63 లక్షల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ముగిసే సమయానికి 14 నుండి 15 కోట్ల మధ్యలో గ్రాస్ రావొచ్చు.

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన అజిత్ ‘విడాముయార్చి’ చిత్రం విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 17 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. అలాంటిది విజయ్ సీఎం హైప్ తో వస్తున్నప్పటికీ కూడా ఆయన రేంజ్ ఓపెనింగ్ ని అందుకోలేకపోతున్నాడు అంటే , కచ్చితంగా ఎక్కడో తేడా జరిగింది అనే అనుకోవాలి. విడుదలకు ముందే పైరసీ అవ్వడం పెద్ద దెబ్బ. అందుకే ఈ చిత్రానికి అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం లేదు. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పాజిటివ్ టాక్ వస్తే 70 నుండి 80 కోట్ల మధ్యలో గ్రాస్ రావొచ్చు అని అంటున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Oktelugu Epaper