దర్శక దిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరక్కెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీంగా కన్పించబోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే చరణ్.. ఎన్టీఆర్ పై విడుదలైన టీజర్లు సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. చరణ్ పుట్టినరోజున ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ విడుదలకాగా.. కొమురంభీం పుట్టినరోజున ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ఇప్పటికే పలు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఓ స్వీట్ రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్వాతంత్ర్యోద్యమంలో కీలక ఘట్టమైన జలియన్ వాలాబాగ్ ను రాజమౌళి తనదైన స్టైల్లో ‘ఆర్ఆర్ఆర్’లో చూపించబోతున్నాడట. ఈ ఎపిసోడ్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: ఫైటింగ్ చేసేందుకు భయపడుతున్న హీరోలు..!
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రారంభంలోనే దర్శకుడు రాజమౌళి ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. రెండు కాలాలకు చెందిన ఇద్దరు దేశభక్తులు కలిస్తే ఎలా ఉంటుందనే ఫాంటసీతో ‘ఆర్ఆర్ఆర్’ను తెరక్కెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. మూవీలో బ్రిటిషర్లు కనిపిస్తారు కానీ ఫ్రీడమ్ ఫైటింగ్ కనిపించదని క్లారిటీ ఇచ్చాడు. అలాంటప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో జలియన్ వాలాబాగ్ ఘటనను రాజమౌళి పెడుతారా? అనే సందేహం కలుగుతోంది.
అల్లూరి.. కొమురంభీంలు కలిస్తే ఎలా ఉంటుందో అని రాజమౌళి ఊహకు తోడు జలియన్ వాలాబాగ్ ఘటన కూడా తోడై సినిమాకు మరింత ప్లస్ కానుంది. కరోనా నేపథ్యంలో ఇలాంటి ఘటనను తెరకెక్కించాలంటే వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా పరిస్థితులతో నిర్మాతలపై అదనపు భారం పడుతోంది.
Also Read: సుధీర్ బాబు ‘శ్రీదేవి’ ఆమెనా?
కరోనా నేపథ్యంలో రాజమౌళి సినిమాకు అవసరంలేని ఈ సంఘటనను రిస్కు తీసుకొని పెడుతారా? అనేది సందేహంగా మారింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’లో జలియన్ వాలాబాగ్ సంఘటన ఉండకపోవచ్చని టాక్ విన్పిస్తోంది. అభిమానులు మాత్రం రాజమౌళి తనదైన స్టైల్లో జలియన్ వాలాబాగ్ ఘటన చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.