సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు.. మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో చిన్నపాత్రలకే పరిమితమైన సుధీర్ బాబు ‘ప్రేమ కథాచిత్రమ్’ మూవీతో హీరోగా స్థిరపడ్డాడు. ఈ సినిమా విజయంతో సుధీర్ బాబుకు వరుస అవకాశాలు వచ్చాయి. తాజాగా ‘వి’ చిత్రంలో నానితో కలిసి నటించాడు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించనప్పటికీ సుధీర్ బాబుకు మాత్రం నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
‘వి’ తర్వాత సుధీర్ బాబు చేస్తున్న చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ మూవీని ‘పలాస’ ఫేం కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ‘పలాస’ చిత్రం మాదిరిగానే ఈ మూవీ కూడా 1980 బ్యాక్ డ్రాప్ లో నడువనుంది. దర్శకుడు కరుణ కుమార్ రెండో ప్రయత్నం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ‘శ్రీదేవి సోడా సెంటర్’ కు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
Also Read: ఫైటింగ్ చేసేందుకు భయపడుతున్న హీరోలు..!
ఈ మోషన్ పోస్టర్లో సుధీర్ బాబు సోడా సీసా పట్టుకుని.. భుజంపై లైట్లు వేసుకుని నవ్వుతూ కనిపించాడు. టైటిల్ పక్కనే దివంగత కథానాయిక శ్రీదేవి ఫొటో కన్పిస్తోంది. పక్కా పల్లెటూరి.. గ్రామీణ జాతర వాతావరణం ఉట్టిపడేలా సినిమాను రూపిందించినట్లు తెలుస్తోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా.. శశి దేవిరెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: చిరు సినిమాపై కీర్తిసురేష్ మౌనం.. అందుకేనా?
‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. అయితే సుధీర్ బాబు పక్కన ‘శ్రీదేవి’ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ‘పలాస’ మూవీలో నటించిన నక్షత్రనే ఈ మూవీలోనూ హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. పలాసలో నక్షత్ర నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెనే తీసుకోవాలని కరుణ కుమార్ ఫిక్స్ అయినట్లు టాక్ విన్పిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.