https://oktelugu.com/

జగన్ సర్కార్ పై మరోసారి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ జగన్ కు తలిగింది. నిమ్మగడ్డ పిటీషన్ విచారించిన హైకోర్టు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్‌ సర్కార్‌‌ తీరును మరోసారి ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతులపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని […]

Written By: , Updated On : November 3, 2020 / 04:52 PM IST
Follow us on

Jagan Sarkar

ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ జగన్ కు తలిగింది. నిమ్మగడ్డ పిటీషన్ విచారించిన హైకోర్టు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. జగన్‌ సర్కార్‌‌ తీరును మరోసారి ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని.. ఈసీ వినతులపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ తాజాగా ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సహకరించడం లేదని.. ఈసీ వినతులపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. తాము తొలగించిన వ్యక్తి తిరిగి సీఈసీగా రావడంతో.. ప్రభుత్వం నాన్ కో ఆపరేటివ్‌గా వ్యవహరిస్తోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వాలు మారుతాయి.. రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ ఉంటాయని.. రాజ్యాంగ సంస్థలను కాపాడుకోకుంటే ప్రజాస్వామ్యం కుప్పకూలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ఈసీ మూడు రోజుల్లో ప్రభుత్వానికి సవివర వినతిపత్రం ఇవ్వాలని.. ప్రభుత్వం నివేదికను 15 రోజుల్లోగా కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Also Read: జగన్‌కు తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు నేతలు

అలాగే మాజీ జస్టిస్ కనగరాజ్ ఫీజు చెల్లింపుల విషయంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కనగరాజ్ తన పదవికి సంబంధించి అడ్వొకేట్ నియమించుకుంటే.. సొంత చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. ఆయన ఇంటి కోసం రూ.20 లక్షలు, ఫర్నిచర్‌కు రూ.15 లక్షల అంశంపై ఈసీ మరోసారి పరిశీలించాలని సూచించింది. అలాగే కనగరాజ్ లాయర్ ఖర్చు వివరాలు ప్రజలకు తెలియాలని.. ఇదంతా ప్రజల సొమ్మేనని వ్యాఖ్యానించింది.

Also Read: అమెరికాలో రెండు పార్టీలే ఎందుకు ఉంటాయి?

ఇప్పటికే ప్రతి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఎక్కుతున్న జగన్ ఈ నిమ్మగడ్డ కేసు విషయంలో ఎలా స్పందిస్తాడనేది వేచిచూడాలి.