Jailer Twitter Talk: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్ షో లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ టాక్ బయటకు వచ్చింది. ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన ఫ్యాన్స్ కు ఈ సినిమా నచ్చిందా లేదా ? అలాగే సాధారణ సినీ ప్రేమికులను ఈ సినిమా ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.
ఇప్పటికే పూర్తయిన ప్రీమియర్స్ షో టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా రజిని నుండి గత కొద్ది కాలంగా వస్తున్న సినిమాల కంటే బెటర్ గా ఉందనే టాక్ నడుస్తుంది. ముఖ్యంగా రజిని స్టైల్ ఆయన ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చినట్లు తెలుస్తుంది. కథ విషయానికి వస్తే రిటైర్డ్ ఉద్యోగి అయిన రజినీకాంత్ ఫ్యామిలీ తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న అతని జీవితాన్ని మాఫియా డిస్టర్బ్ చేస్తుంది. ఒకప్పటి ఈ జైలర్ కుటుంబం కోసం మాఫియాపై యుద్ధం మొదలుపెడతాడు. బడా మాఫియాతో వన్ మాన్ ఆర్మీ రజినీకాంత్ ఎలా పోరాడి గెలిచాడు అనేది కథ…
ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉందని, రజనీ మార్క్ కామెడీ ఫస్ట్ ఆఫ్ కు ప్లస్ అయినట్లు తెలుస్తుంది. ఇక మాఫియా తో పోరు స్టార్ట్ అయిన దగ్గర నుండి సినిమా మరో లెవెల్ కి వెళ్లిందని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోయినట్లు తెలుస్తుంది. అదే విధంగా సెకండ్ ఆఫ్ కూడా బాగా వచ్చిందని, కాకపోతే దర్శకుడు నెల్సన్ యొక్క డార్క్ కామెడీ వలన సినిమా అక్కడక్కడ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుందని, అలాగే అనిరుద్ మ్యూజిక్ కూడా కొన్ని సన్నివేశాల్లో హెవీ గా ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రీమియర్స్ టాక్ ను గమనిస్తే ఈ సినిమా ఫ్యాన్స్ కి అయితే పండగే అని, సాధారణ ప్రేక్షకులకు అబోవ్ యావరేజ్ అని తెలుస్తుంది. కానీ అసలైన రివ్యూ రావాలంటే నార్మల్ షోస్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అయితే ఓవరాల్ గా వినిపిస్తుంది ఏమిటంటే రోబో 2.O తర్వాత ఆ స్థాయిలో హిట్ అయ్యే సరకు ఈ జైలర్ మూవీ లో ఉందని తెలుస్తుంది. తెలుగు లో ఒక్కప్పుడు భారీ వసూళ్లు చూసిన రజినీ గత కొద్ది కాలంగా డౌన్ అయ్యాడు. కానీ మళ్ళి ఈ సినిమాతో తన సత్తా ఏమిటో చూపించే అవకాశం ఉందని ఆయన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
#Jailer Overall a Decent Commercial Entertainer!
First half works well along with a few very good mass sequences. Comedy also works in the 1st half. However after the post interval sequence, the 2nd half drags and goes over the top until the pre-climax. Rajni and the music are…
— Venky Reviews (@venkyreviews) August 10, 2023
#Jailer interval – Rajini sir in a Nelson movie ! Perfect casting , world class music from @anirudhofficial , perfectly set up for the rise in the second half !
— Prashanth Rangaswamy (@itisprashanth) August 10, 2023