Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కేరీర్ లో ఎంతో ముఖ్యమైన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా, ఫ్లాప్స్ లో ఉన్న రజినీకాంత్ సత్తా ని నేటి తరం ఆడియన్స్ కి మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఇటీవలే మొదలైంది. కేరళలోని ఒక ప్రాంతం లో మొదలైన ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా సాగుతూనే ఉంది. రజినీకాంత్ కూడా రీసెంట్ గానే షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కచ్చితంగా రజినీకాంత్ చరిష్మా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పనితనం అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. కానీ అదనపు ఆకర్షణగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ క్యామియో రోల్స్ నిలిచాయి.
Also Read: విక్రమ్ మాస్ విశ్వరూపం.. దుమ్ములేపేసిన ‘వీర ధీర సూర’ టీజర్.. ఈసారి గురి తప్పేలా లేదు!
వీళ్ళ ఎంటర్ అయ్యినప్పుడు థియేటర్స్ టాప్ లేచిపోయింది. ‘జైలర్ 2′(Jailer 2) లో కూడా వీళ్ళ రోల్స్ ఉంటాయి. వీళ్ళ రోల్స్ తో పాటుగా మన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) క్యామియో కూడా ఉంటుందట. రీసెంట్ గానే డైరెక్టర్ నెల్సన్ బాలయ్య తో చర్చలు జరిపి, ఆయన డేట్స్ కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. బాలయ్య ఈ చిత్రం 15 నిమిషాల పాటు కనిపించనున్నాడు.అందుకోసం ఆయన 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు టాక్. ఆయనకు ఊర మాస్ ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. ఒక్కసారి ఊహించుకోండి, పవర్ ఫుల్ బాలయ్య ని, పీక్ రేంజ్ యాటిట్యూడ్ తో ఉండే రజిని ని ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఆడియన్స్ ఏ రేంజ్ లో వెర్రిక్కిపోతారో. తమిళనాడు లో ఎలాగో ఈ సినిమా విద్వంసం సృష్టిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగు లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ విద్వంసం సృష్టిస్తుంది.
‘జైలర్’ చిత్రం తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు బాలయ్య కూడా తోడు అవ్వడంతో, తెలుగు వెర్షన్ కి సరైన బ్లాక్ బస్టర్ టాక్ పడితే, 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే భీభత్సం అనే చెప్పాలి. ఇకపోతే రజినీకాంత్ రీసెంట్ గానే లోకేష్ కనకరాజ్ తో మొదలు పెట్టిన ‘కూలీ’ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఆగష్టు 14 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆయన ‘జైలర్ 2’ కి షిఫ్ట్ అయ్యాడు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే సినిమాలే అని కోలీవుడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
Also Read: మహేష్ , రాజమౌళి మూవీ సెట్స్ లో హోలీ ఆడిన హీరోయిన్ ప్రియాంక చోప్రా..వైరల్ అవుతున్న ఫోటోలు!