Robin Hood : రీసెంట్ గా విడుదలైన నితిన్(Nithin) ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో హీరో నితిన్ ఈ సినిమా విజయం పై చాలా నమ్మకం తో ఉండేవాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ప్రొమోషన్స్ వివిధ డిఫరెంట్ పద్ధతుల్లో ఇరగ కుమ్మేసాడు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోవడం లో ఘోరంగా విఫలమైంది. భీష్మ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కలిసి చేసిన చిత్రమిది. అందుకే ఆడియన్స్ కూడా వెంకీ సినిమా అంటే మినిమం రేంజ్ లో ఉంటుంది, ‘రాబిన్ హుడ్’ కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని అనిపించుకున్నా, సెకండ్ హాఫ్ పూర్తిగా రొటీన్ ఫార్మటు లో ఉండడంతో ఆడియన్స్ తిప్పి కొట్టారు.
Also Read : ‘రాబిన్ హుడ్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్ మారకపోతే కష్టమే!
ఫలితంగా ఫుల్ రన్ లో కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేక చతికిల పడింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ అవ్వడం తో ఓటీటీ రైట్స్ విషయం లో నిర్మాతతో భేరసారాలు చాలా గట్టిగానే జరిగాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 సంస్థ అన్ని భాషలకు కలిపి మంచి రేట్ కి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ముందుగా కొంత అడ్వాన్స్ ఇచ్చారు. కానీ బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ చూసిన తర్వాత తక్కువ రేట్ కి ఇవ్వమని నిర్మాతలపై ఒత్తిడి పెంచారు. అయితే నిర్మాత తగ్గాడో, లేకపోతే జీ5 సంస్థ తగ్గిందో తెలియదు కానీ, మొత్తానికి ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే జీ5 ఈ చిత్రాన్ని మే10 న జీ5 ఛానల్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే రోజునే, జీ టీవీ లో కూడా టెలికాస్ట్ అవ్వబోతుందట. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయం లో కూడా ఇదే స్ట్రాటజీ ని అనుసరించారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీవీ టెలికాస్ట్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి 15 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ‘రాబిన్ హుడ్’ కూడా కొత్త సినిమా కావడంతో అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందేమో అని ఆశిస్తున్నారు. చాలా సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యినవి, ఓటీటీ లేదా టీవీ టెలికాస్ట్ లో సూపర్ హిట్ అవ్వడం వంటివి మనం ఎన్నోసార్లు చూసాము. ఈ చిత్రానికి కూడా అదే జరుగుతుందని చిన్న ఆశతో ఉన్నారు. ఈ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. అదే విధంగా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించాడు.
Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎపిక్ డిజాస్టర్!