Star Heroine: కానీ ప్రారంభంలో ఎన్నో అవమానాలను, అడ్డంకులను దాటి సినిమా ఇండస్ట్రీలో రాణించినవారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పొచ్చు. ఇందులో మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో నటిగా రాణించాలని ఈమె కెనడా నుంచి ఇండియాకు కేవలం రూ.5 వేళ్ళతో వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ కేవలం ఐదు నిమిషాలకు రూ.2 కోట్లు పారితోషకం అందుకుంటుంది. కొంతమందికి సినిమా ఇండస్ట్రీలో చాలా ఈజీగా విజయం దక్కుతుంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్డం సొంతం చేసుకుంటారు. మరి కొంతమంది తక్కువ సమయంలోనే సినిమా ఇండస్ట్రీలో కనిపించకుండా కనుమరుగైపోతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే నటి ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అడ్డంకులు, మోసాలు అలాగే అవమానాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఈ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఈ నటి పేరు నోరా ఫతేహీ. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నోరా ఫతేహి కెనడాలో టోరెంటోలో పుట్టి పెరిగింది. ఈ బ్యూటీ రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్ బంద్ అనే హిందీ సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.
Also Read: ఇన్నోవాకు ఇక కష్టకాలం మొదలు.. కియా క్లావిస్‌తో మార్కెట్ షేక్!
తెలుగులో కూడా నోరాఫత్ టెంపర్, బాహుబలి ది బిగినింగ్ అలాగే కిక్ 2 వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నోరా ఫతేహీ చేసిన దిల్బర్ సాంగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటతో ఆమెకు అంతర్జాతీయ స్టార్ గా కూడా గుర్తింపు వచ్చింది. ఈమె విజయం అంత సులభంగా రాలేదు. కెరియర్ మొదట్లో ఈమె చాలా అవమానాలను ఎదుర్కొంది. ఒక ఇంటర్వ్యూలో నటి నోరా ఫతేహి జీవితంలో తాను ఎదుర్కొన్న అడ్డంకుల గురించి అవమానాల గురించి చెప్పుకొచ్చింది. నేను కేవలం 5000 రూపాయలతో ఇండియాకి వచ్చాను. ఒక అపార్ట్మెంట్లో మూడు బెడ్ రూమ్ ఉన్న ఫ్లాట్లో 9 మంది మానసిక రోగులతో కలిసి నేను ఉన్నాను.
అప్పట్లో నేను ఎన్నో కష్టాలను పడ్డాను. ఆ సమయంలో ఒక ఏజెన్సీ కూడా నన్ను మోసం చేశారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి నాకు వచ్చిన పారితోషకం నుంచి అద్దె, కమిషన్ కట్ చేసుకున్నారు. చివరకు మిగిలిన డబ్బులు నాకు ఇచ్చారు. ఆకలికి తట్టుకోలేక గుడ్డు, బ్రెడ్ పాలు తాగి బతికాను. ఏజెన్సీలలో చాలా మోసాలు జరుగుతుంటాయి. చట్టాలు నిబంధనలు కూడా వీటికి లేవు అంటూ తెలిపింది. చివరిగా ఈమె అభిషేక్ బచ్చన్ నటించిన బీ హ్యాపీ సినిమాలో కనిపించింది. కొన్ని నివేదికల ప్రకారం నోరా పతేహీ ప్రస్తుత ఆస్తుల విలువ రూ.52 కోట్లు అని సమాచారం. ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఆమె రెండు నుంచి మూడు కోట్లు పారితోషకం అందుకుంటుంది అని తెలుస్తుంది.