ఇదంతా పక్కన పెడితే ప్రియాంక చోప్రా ఇందులో ఏ క్యారక్టర్ చేస్తుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మహేష్ బాబు పక్కన ఈ ముదురుభామ హీరోయిన్ ఏమిటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇద్దరు ఒకే ఏజ్ గ్రూప్ కి చెందిన వాళ్ళు అయినప్పటికీ మహేష్ బాబు స్కిన్ టోన్ పక్కన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సరిపోదు అనేది అనేక మంది అభిప్రాయం. అయితే ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటించడంలేదని, విలన్ క్యారక్టర్ లో నటిస్తుందని మరి కొంతమంది అంటున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ నుండే ఒక యంగ్ హీరోయిన్ ని ఎంచున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఏది నిజం ఏది అబద్దం అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మూవీ స్టోరీ పై వివరణ ఇచ్చే వరకు ఈ ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉంటాయి.
ప్రస్తుతం ఒడిశా లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా, త్వరలోనే సౌత్ ఆఫ్రికా లో కూడా షూటింగ్ ని జరుపుకోనుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ తో పాటు కోయ భాష కూడా నేర్చుకున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి సినిమాలంటే కనీసం రెండు మూడేళ్లు షూటింగ్ సెట్స్ లోనే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా మొదటి భాగాన్ని సాధ్యమైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దీనిపై కూడా స్పష్టమైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.