Veera Dheera Sura: తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు చియాన్ విక్రమ్(Chiyaan Vikram). ఈయన మన తెలుగు సినిమా ద్వారానే వెండితెర అరంగేట్రం చేసినప్పటికీ, ఆ తర్వాత ఆయన తమిళ ఇండస్ట్రీ కి వెళ్లి అక్కడ అగ్ర హీరో గా స్థిరపడ్డాడు. ‘అపరిచితుడు’ సమయం లో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ సినిమా తర్వాత విక్రమ్ కి అటు తమిళం లో కానీ, ఇటు తెలుగు లో కానీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. క్లీన్ హిట్ తగిలి చాలా కాలం అయిపోయింది. ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలు వచ్చారు, ఈయన మార్కెట్ ని కూడా దాటేసారు కానీ, విక్రమ్ మాత్రం ఇంకా అలాగే ఉండిపోయాడు. ప్రతీ చిత్రం లోనూ తన నటనతో ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్ కి గురి చేయాలనే తపన కారణంగానే ఆయనకు ఫ్లాప్స్ వస్తున్నాయి అనేది విశ్లేషకులు చెప్తున్నమాట.
రీసెంట్ గా విడుదలైన ‘తంగలాన్’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అభిమానులంతా నిరాశగా ఉన్న సమయంలో వారిలో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన చిత్రం ‘వీర ధీర సూర'(Veera Dheera Sura) చిత్రం. ఈ సినిమా పై తమిళ నాడు లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ ని ఇలాంటి ఊర మాస్ కమర్షియల్ సినిమాలో చూసి చాలా ఏళ్ళు అయ్యింది. అభిమానులకు ఈ టీజర్ ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ టీజర్ చివర్లో విక్రమ్ చేతిలో బాంబు పట్టుకొని రావడం హైలైట్ గా నిల్చింది. ఇలాంటి సన్నివేశాల్లో ఆయన్ని చూసి చాలా రోజులైంది. అభిమానులు ఆయన నుండి కోరుకునే హిట్ మాత్రం వచేసినట్టే అనుకోవచ్చు, ఆ కల టీజర్ లో కనిపిస్తుంది.
ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు విడుదల అవ్వబోతున్నది రెండవ భాగానికి సంబంధించిన సినిమా. మొదటి భాగం ప్రీక్వెల్ గా వచ్చే ఏడాది విడుదల అవ్వొచ్చు. అది కూడా రెండవ భాగం సూపర్ హిట్ అయితేనే. విక్రమ్ రీసెంట్ గా చేసిన సినిమాలలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ అనొచ్చు. కానీ పేరు మొత్తం డైరెక్టర్ మణిరత్నం కి వచ్చింది. ఈ వీర ధీర సూర చిత్రానికి మాత్రం కచ్చితంగా విక్రమ్ కి మాత్రమే పేరొస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మరి కమర్షియల్ గా ఈ చిత్రమైన విక్రమ్ మార్కెట్ కి మళ్ళీ పూర్వ వైభవం రప్పిస్తుందా లేదా అనేది. ‘వీర ధీర సూర’ టీజర్ ని క్రింద అందిస్తున్నాము ఒకసారి చూసి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.