Jagadeka Veerudu Atiloka Sundari : సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా సాధారణ వ్యక్తి కూడా మెగాస్టార్ గా మారవచ్చు అని ప్రూవ్ చేసిన ఒకే ఒక్క నటుడు చిరంజీవి(Chiranjeev)… ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి స్టార్ హీరోగా ఒక గొప్ప స్టేటస్ ని సంపాదించుకున్నాడు. ఆయనను మించిన నటుడు మరెవరు లేరు అనే అంతలా గొప్ప గుర్తింపును తెచ్చుకున్న ఆయన ఇప్పటివరకు ఇప్పటి వరకు వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
Also Read : ఓవర్సీస్ లో ‘జగదేక వీరుడు’ కి సెన్సేషనల్ రెస్పాన్స్..3 రోజుల్లో ఇంత విద్వంసమా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు ఆయన రాఘవేంద్రరావు (Raghavalendra Rao) దర్శకత్వంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. మరి రీసెంట్ గా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి దాదాపు 8 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. కానీ మొదటి రోజు ఈ సినిమాకు చాలా మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక ఆ తర్వాత రోజు నుంచి సినిమాని పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఇప్పటివరకు నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : Also Read : దుమ్ములేపిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
ఇకమీదట ఈ సినిమాని పెద్దగా ఆదరించే ప్రేక్షకులు కూడా లేరనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి 8 కోట్ల రూపాయలను కేటాయించిన సినిమా యూనిట్ 15 కోట్ల వరకు సినిమా కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది అనే ఒక అంచనాలో ఉన్నారు.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా కేవలం నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయడంతో ఈ సినిమా రీ రిలీజ్ లో డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మిగిలినప్పటికి ఇప్పుడున్న జనరేషన్ లో ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్ కి వచ్చి చూసేంత సమయం అయితే వెచ్చించడం లేదు.
ఇంకా కొంతమంది మాత్రం ఈ సినిమాని అప్పుడు థియేటర్లో చూడలేదు ఇప్పుడు చూస్తాము అంటూ ముందుకు కదిలారు. కానీ మరి కొంతమంది మాత్రం లైట్ తీసుకున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ లో ఫ్లాప్ అవ్వడం అనేది చిరంజీవి అభిమానులను కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి…