Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తూ వాటిని సూపర్ సక్సెస్ గా నిలుపుతూ ఉంటారు. అందువల్లే వాళ్ళ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఒక సినిమాని సూపర్ సక్సెస్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఆ సినిమా కోసం ఆయా హీరోలు భారీగా కష్టపడుతూ సరైన అవుట్ పుట్ తీసుకొచ్చి సినిమాని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది. స్టార్ హీరోగా తను గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా పదవీ బాధ్యతలను కొనసాగిస్తూ పేద ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడిగా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమాకు సంబంధించిన డేట్స్ మొత్తాన్ని కేటాయించి ఆ సినిమాను ఫినిష్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు సుజిత్ (Sujeeth) డైరెక్షన్లో వస్తున్న ఓజి (OG) సినిమా మీద కూడా డేట్స్ అయితే కేటాయించారు. పవన్ కళ్యాణ్ సడన్ గా తన సినిమాలను ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతూ ఉండడం పట్ల కొంతమంది సినిమా మేధావులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులపాటు సినిమాను సెట్స్ మీద ఉంచడం వల్ల ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!
ఎందుకంటే అతను ఫైనాన్సియర్స్ దగ్గర ఫైనాన్స్ లు పెరిగిపోతూ ఉంటాయి. తద్వారా సినిమా ఎంత సక్సెస్ ని సాధించిన కూడా ప్రొడ్యూసర్ కి వచ్చే లాభం కంటే అతను ఫైనాన్సర్లకు చెల్లించే ఫైనాన్స్ లే ఎక్కువగా ఉంటాయని చాలామంది సినిమా విమర్శకులు సైతం చెబుతూ ఉంటారు.
మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్స్ కి వచ్చే నష్టాల గురించి ఆలోచించి తన రెమ్యూనరేషన్ లో కొంతభాగం వెనక్కి ఇచ్చేసి ఈ సినిమాలను ఎలాగైనా సరే పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఎంచుకున్న కథలు అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిని ఫినిష్ చేయడంలో పవన్ కళ్యాణ్ కి సమయం అయితే దొరకడం లేదు.
ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్ని పనులను పక్కనపెట్టి మరి ఈ సినిమాలకే తన డేట్స్ ని కేటాయించి సినిమాలను ఫినిష్ చేసి రిలీజ్ చేస్తే తన అభిమానులు కూడా ఆనందం గా ఉంటారనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలను ఫినిష్ చేయడానికి తన డేట్స్ ను కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. దేశం దృష్టిని ఆకర్షించిన మహిళా ఆధికారులు