Jagadeka Veerudu Athiloka Sundari: మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(#JVASReRelease) చిత్రాన్ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?, ఫాంటసీ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ ని నెలకొల్పిన చిత్రమిది. ఆరోజుల్లో ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు, ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగారు, ప్రతీ సన్నివేశం ఒక పెయింటింగ్ లాగా ఉంది, ఇలాంటి కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి తియ్యడం ఇప్పటి వరకు హిస్టరీ లో జరగలేదంటూ నేటి తరం ఆడియన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. అకస్మాత్తుగా ఈ సినిమా గురించి ఈ స్థాయిలో చర్చ జరగడానికి ప్రధాన కారణం, మే 9న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వడం వల్లే. ఈ రిలీజ్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ముందుగా ఎవ్వరూ ఊహించలేదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
Also Read: ‘రెట్రో’ 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ ని అందుకోవడం ఇక అసాధ్యమే!
వివరాల్లోకి వెళ్తే కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండే ఈ చిత్రానికి 55 వేల డాలర్లు వచ్చాయి. ఇప్పటి వరకు అక్కడ రీ రిలీజ్ అయిన చిత్రాల్లో ఆల్ టైం టాప్ 5 సినిమాల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి వి రెండు సినిమాలు ఉంటాయి. ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి’ చిత్రం 5 వ స్థానం లో కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని 3D లో విడుదల చెయ్యాలనే ఆలోచన రావడం, నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అందువల్లే ముఖ్యమైన సిటీస్ లో అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ చిత్రం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం లో మూడు రోజులకు కలిపి 82 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 24 లక్షలు, ఆంధ్ర ప్రాంతం లో 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 44 లక్షలు, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 2 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 35 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమా రీ రిలీజ్ అయితే ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈమధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలు హిట్ అవ్వాలంటే యూత్ ఆడియన్స్ థియేటర్స్ కి కచ్చితంగా కదలాల్సిందే. ఇలాంటి సినిమాలకు యూత్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపారు అనేది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. కానీ వాళ్ళ అంచనాలను కూడా తలక్రిందులు చేసింది ఈ చిత్రం. నేడు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి పలు ప్రాంతాల్లో డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ వారం కూడా థియేట్రికల్ రన్ ఉంటే ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి.