Jagadeka Veerudu Athiloka Sundari: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చి, మెగాస్టార్(Megastar Chiranjeevi) కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిల్చిన ‘జగదేక వీరుడు..అతిలోక సుందరి'(Jagadeka Veerudu..Athiloka Sundari) చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి, 3D వెర్షన్ లోకి కూడా కన్వెర్ట్ చేసి నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 35 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా, ఇప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం ఏమి నచ్చుతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను అధిమించి ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో మొదటి రోజు 17 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్ లో అమ్ముడుపోయిన టికెట్స్ ని కూడా కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి 32 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.
Also Read: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ ఆ హిట్ సినిమా కి రీమేక్ గా రాబోతోందా..?
ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి కోటి 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి కళ్ళు చెదిరే గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కేవలం నార్త్ అమెరికా నుండే మొదటి రోజు 27 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న విడుదలైన కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు కాలేదు. ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 3D వెర్షన్ లోకి మార్చి విడుదల చేయడం ఈ సినిమాకు చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ అయ్యింది. కేవలం చిరంజీవి అభిమానులు మాత్రమే కాకుండా, మామూలు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ఎట్టి పరిస్థితిలో చూడాల్సిందే అనే ఉత్సాహం కలిగించింది ఈ చిత్రం.
రెండవ రోజు కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతున్నాయి. రెండవ రోజున ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 14 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ షోస్ నుండి గ్రాస్ వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇదే ట్రెండ్ ని రేపు కూడా కొనసాగిస్తే ఈ చిత్రానికి ఫుల్ రన్ లో మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. గతం లో చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. ఈ సినిమా మెగాస్టార్ రీ రిలీజ్ మూవీస్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది. ఇప్పుడు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం కూడా ఆ క్యాటగిరీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి.