Homeక్రీడలుక్రికెట్‌Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలో.. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్...ఇంతకీ ఏమా...

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలో.. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్…ఇంతకీ ఏమా కథ!

Padi Kaushik Reddy : భారత రాష్ట్ర సమితిలో ఉన్న యువ ఎమ్మెల్యేలలో పాడి కౌశిక్ రెడ్డి ఒకరు. అత్యంత బలమైన ఈటెల రాజేందర్ పై ఆయన ఘనవిజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు.. హుజూరా బాద్ నియోజకవర్గంలో సంచలన విజయం సాధించి అప్పట్లో మీడియాను మొత్తం తన వైపు తిప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. కుటుంబం అంతా కలిసి చేసిన ప్రచారం.. మీడియాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.. కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోనే ఉంటారు. ఇప్పుడంటే రాజకీయ నాయకుడిగా.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గాని.. ఒకప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అద్భుతమైన క్రికెటర్. ఇండియన్ క్రికెట్ లీగ్ లో మెరిశారు.. హైదరాబాద్ జట్టు తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. అంతేకాదు టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ కూడా పడగొట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.. ఇటీవల ipl ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన క్రికెటర్లను కౌశిక్ రెడ్డి స్వయంగా కలిశారు. తన కుమార్తెకు ఆటోగ్రాఫ్ లు కూడా ఇప్పించారు.

Also Read : పంజాబ్, ఢిల్లీకి పాయింట్లు ఇవ్వంది అందుకే.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

పాడి కౌశిక్ రెడ్డి గతంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పుడు.. రోహిత్ శర్మ వికెట్ పడగొట్టాడు. దానికి సంబంధించిన వార్త అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ఇప్పుడు కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ముంబై జట్టు పై ఆడిన ఆ మ్యాచ్లో కౌశిక్ రెడ్డి 48 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లు సాధించాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశాడు..” క్రికెట్ నాకు లోతైన అభిరుచి కలిగించిన అంశం. ఇటీవల నేను పాత వార్తాపత్రికల క్లిప్పింగ్స్ చూశాను. అవి నా నోస్టాల్జియా ను ప్రేరేపించాయి. ప్రస్తుతం వన్డేలలో కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను అవుట్ చేయడం నాకు ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఇలాంటి జ్ఞాపకాలు నాకు తరచూ గొప్ప ఆనందాన్ని అందిస్తాయి. ఆ ప్రియమైన అనుభవాలను నేను గుర్తు చేసుకుంటున్నప్పుడు.. గొప్పగా అనిపిస్తుంది.. హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన నేను.. ముంబై పై జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించిన సందర్భాన్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటానని” కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించాడు . ఇక డొమెస్టిక్ క్రికెట్లో కౌశిక్ రెడ్డి మొత్తం 15 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. 12 లిస్ట్ ఏ గేమ్స్ కూడా ఆడాడు. 2007 వరకు అతడు యాక్టివ్ క్రికెటర్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. 2018 నుంచి అతడు ఒక్కసారిగా పొలిటికల్ లీడర్ గా మారిపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై విజయం సాధించాడు.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి తరపున ఉన్న యువ ఎమ్మెల్యేలలో కీలకంగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ipl ఆడేందుకు హైదరాబాద్ వచ్చిన క్రికెటర్లను ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి కలిశాడు. తన కుమార్తె శ్రీనిక కు ఆటోగ్రాఫ్ ఇప్పించాడు. ఆ ఆటోగ్రాఫ్లను చూసి ఆమె ఎంతగానో మురిసిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version