Jack OTT: ‘టిల్లు స్క్వేర్’ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) నటించిన చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్'(Jack Movie). బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. సిద్దు జొన్నలగడ్డ దర్శకత్వం లో చొరవ తీసుకొని, డైరెక్టర్ విజన్ ని చెడగొట్టడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ పలువురు విశ్లేషకులు విమర్శించారు కూడా. అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమాపై ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ సెకండ్ హాఫ్ పై మాత్రం తీవ్రమైన నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ, టేకింగ్ సరిగా లేకపోవడం వల్లే అలాంటి ఫలితం వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: ‘L2 ఎంపురాన్’ ని దాటేసిన ‘తుడరం’..10 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతంటే!
అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. సిద్దు జొన్నలగడ్డ గత చిత్రం డీజే టిల్లు కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం తో , ‘జాక్’ చిత్రానికి నిర్మాత ఎంత డిమాండ్ చేస్తే, అంత రేట్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 8వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే రోజున తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం కూడా విడుదల కానుంది. కాబట్టి ఓటీటీ ఆడియన్స్ జాక్ కంటే ఎక్కువగా ఈ సినిమా వైపే మొగ్గు చూపించవచ్చు. కానీ థియేటర్స్ లో సూపర్ హిట్స్ గా నిల్చిన ప్రతీ సినిమా ఓటీటీ లో కూడా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు.
ఎందుకంటే థియేటర్స్ లో బంపర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఎన్నో సినిమాలు, ఓటీటీ లో మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అదే విధంగా థియేటర్స్ లో ఫ్లాప్ అయినా సినిమాలు, ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓటీటీ ఆడియన్స్ కి జాక్ చిత్రం నచ్చితే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కంటే మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకోవచ్చు ఏమో చూద్దాం. ఈ చిత్రం లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ‘బేబీ’ వంటి భారీ హిట్ తర్వాత ఈ క్యూటీ నటించిన ‘లవ్ మీ ‘ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో అని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది.