L2 Empuraan : ఈ ఏడాది మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal) బాక్స్ ఆఫీస్ వద్ద శివతాండవం ఆడుతున్నాడు అనే చెప్పాలి. ఏడాది ప్రారంభం లో ‘బజూకా’ అనే సోషియో ఫాంటసీ చిత్రం ద్వారా భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు కానీ, రీసెంట్ గానే ‘L2: ఎంపురాన్’ చిత్రం తో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ట్రేడ్ పండితులు విస్తుపోయే రేంజ్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 270 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లోనే ‘తుడరం'(Thudarum) అనే ఫ్యామిలీ డ్రామా మూవీ తో మన ముందుకొచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టించింది.
Also Read : అక్షరాలా 262 కోట్లు..కానీ ‘L2: ఎంపురాన్’ కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఎంతంటే!
విడుదలై పది రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, ఇప్పటి వరకు కేవలం కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 2 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక కేరళలో మొదటి పది రోజులకు కలిపి ఈ చిత్రానికి 66 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 6 కోట్ల 70 లక్షలు, తమిళ్ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 6 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 76 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం ఓవర్సీస్ లో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 158 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 78 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపుగా 32 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి పదవ రోజు వచ్చిన వసూళ్లు , మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చాయి. మొదటి రోజు 16 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, పదవ రోజు 16 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వారం లోనే ఈ చిత్రం ‘L2: ఎంపురాన్’ మూవీ వసూళ్లను దాటే అవకాశం ఉన్నది.
Also Read : 5 రోజుల్లో 200 కోట్లు..ఓవర్సీస్ లో ‘L2 : ఎంపురాన్’ సరికొత్త బెంచ్ మార్క్!