https://oktelugu.com/

ఓ ఇంటివాడు కాబోతున్న అవినాష్… అమ్మాయి ఎవరంటే?

బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ ఓ ఇంటివాడు కోబోతున్నాడట. త్వరలోనే తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం ముహుర్తాలు లేవని… అందుకే పెళ్లి సమ్మర్ లో ప్లాన్ చేసినట్లు తెలియజేశారు. దీనితో అవినాష్ ని పెళ్లి చేసుకోనున్న ఆ లక్కీ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13వారాలు ఉన్న అవినాష్.. తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీ హౌస్ లో నవ్వులు పూయించగా, ఫైనల్ కి చేరుతాడని అందరూ […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 11:04 AM IST
    Follow us on


    బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ ఓ ఇంటివాడు కోబోతున్నాడట. త్వరలోనే తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు అవినాష్ చెప్పారు. ప్రస్తుతం ముహుర్తాలు లేవని… అందుకే పెళ్లి సమ్మర్ లో ప్లాన్ చేసినట్లు తెలియజేశారు. దీనితో అవినాష్ ని పెళ్లి చేసుకోనున్న ఆ లక్కీ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13వారాలు ఉన్న అవినాష్.. తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీ హౌస్ లో నవ్వులు పూయించగా, ఫైనల్ కి చేరుతాడని అందరూ భావించారు. అనూహ్యంగా అవినాష్ 14వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. హౌస్ లో ఉన్నప్పుడు కూడా అవినాష్ పెళ్లి టాపిక్ తరచుగా వస్తూ ఉండేది.

    Also Read: 2020లో వివాహ బంధంతో ఏకమైన సినీ ప్రముఖులు !

    వారాంతాల్లో వచ్చిన నాగార్జున అవినాష్ పెళ్లిపై వరుస సెటైర్స్ వేస్తూ ఉండేవాడు. హౌస్ లో ఉన్న అమ్మాయిలను లైన్ లో పెడుతున్నావ్.. ఏంటి కథ అంటుంటే, అవినాష్ సిగ్గుపడేవాడు. అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. మీరు అలా అంటే నాకు పెళ్లి కాదంటూ వేడుకునేవాడు. నిజానికి హౌస్ లో అరియానాతో చిన్న ప్రేమ కథ నడిపాడు అవినాష్. మోనాల్ హగ్గుల కోసం ఆశపడుతూనే… రోజంతా అరియనాతోనే గడిపేవాడు. హౌస్ మేట్స్ అందరూ ఒక టీమ్ గా, అరియనా-అవినాష్ ఒక టీమ్ గా ఉండేవారు. నామినేషన్స్ విషయంలో మరియు టాస్క్ లలో ఒకరికి మరొకరు తోడుగా నిలిచేవారు. అప్పుడప్పుడు గొడవలు పడినా మరలా ఒకటి అయ్యేవారు.

    Also Read: అభిజీత్ కామెంట్స్ పై ‘హారిక’ రియాక్షన్ ఏమిటో ?

    దీనితో అవినాష్ చేసుకోబోయే అమ్మాయి అరియనా కూడా కావచ్చని అంటున్నారు. పెళ్లి సమ్మర్ లో అని చెప్పిన అవినాష్, అమ్మాయి ఎవరనేది చెప్పలేదు. ముహుర్తాలు లేక పెళ్లి ఆగిందంటున్న అవినాష్ అమ్మాయిని సెట్ చేసుకున్నాడని, కాకపోతే బయటికి చెప్పడం లేదని అంటున్నారు. ఇక బిగ్ బాస్ తరువాత అవినాష్ ఫేమ్ రెట్టింపు అయ్యింది. బుల్లితెరపై ఆయన బిజీ కానున్నట్లు తెలుస్తుంది. స్టార్ మా అవినాష్ తో ఓ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా దాదాపు రూ. 40 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడట అవినాష్. జబర్ధస్త్ నుండి బయటికి వచ్చి షోలో పాల్గొన్న అవినాష్ ఆ కామెడీ షోకి గుడ్ బై చెప్పేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్