https://oktelugu.com/

వచ్చే వారమే భారత్ లో కరోనా వ్యాక్సిన్?

ఏడాది కాలంగా కరోనా వైరస్ తో సహవాసం చేస్తున్న భారతీయుల కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. వచ్చే వారమే భారత్ లో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఆ తర్వాత దేశ ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేస్తున్నాయి. Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..? కరోనా కోరలు నుంచి దేశ ప్రజలను […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2020 8:24 pm
    Follow us on

    Corona vaccine

    ఏడాది కాలంగా కరోనా వైరస్ తో సహవాసం చేస్తున్న భారతీయుల కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. వచ్చే వారమే భారత్ లో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడానికి కేంద్రం రెడీ అయ్యింది. ఆ తర్వాత దేశ ప్రజలకు పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేస్తున్నాయి.

    Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన కరోనా సోకే ఛాన్స్.. శాస్త్రవేత్తల హెచ్చరిక..?

    కరోనా కోరలు నుంచి దేశ ప్రజలను విముక్తి కల్పించేందుకు భారత ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగం కింద కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్, ఫైజర్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఫైజర్ టీకా ధర ఎక్కువగా ఉండడం.. దాన్ని భద్రపరిచడానికి మైనస్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు కావాల్సి ఉన్నందున కేంద్రం దాని వైపు మొగ్గు చూపడం లేదు.

    Also Read: కరోనా కొత్తరకం వైరస్ కు వ్యాక్సిన్ పని చేస్తుందా..?

    ఈ క్రమంలోనే భారత్ కు సీరం ఇన్ స్టిట్యూట్-ఆక్స్ ఫర్డ్ కలిసి అభివృద్ధి చేసి ధర తక్కువగా ఉన్న టీకాను కేంద్రం ఆమోదించనున్నట్టు తెలిసింది. ఈ టీకాను సాధారణ ఫ్రిజ్ లో కూడా సుధీర్ఘకాలం భద్రపరిచే అవకాశఆలు ఉండడం.. రవాణాకు అనుకూలంగా ఉండడంతో ఈ టీకాకు తొలుత అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయినట్లు తెలుస్తోంది.

    భారత్ లో సెకండ్ వేవ్ కరోనా రాకముందే ఈ టీకాను అందరికీ వేయాలని కేంద్రం భావిస్తోంది. తొలి విడుదల 6 నెలల్లో దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్