టీఆర్ఎస్ లో అసంతృప్త సెగలు.. కన్నేసిన బీజేపీ?

టీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతల తీరు సీఎం కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా కన్పిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా తగిన గుర్తింపులు రావడం లేదని కొందరు.. పదవులు రావడం లేదని మరికొందరు నేతలు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Also Read: పాస్‌బుక్స్‌ ఉన్నోళ్లందరికీ రైతుబంధు దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావించిన కొందరు నేతలు ఇప్పటికే బీజేపీకి టచ్లోకి వెళుతున్నారు. దీంతో టీఆర్ఎస్ […]

Written By: Neelambaram, Updated On : December 23, 2020 8:27 pm
Follow us on


టీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతల తీరు సీఎం కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చేలా కన్పిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా తగిన గుర్తింపులు రావడం లేదని కొందరు.. పదవులు రావడం లేదని మరికొందరు నేతలు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాస్‌బుక్స్‌ ఉన్నోళ్లందరికీ రైతుబంధు

దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని భావించిన కొందరు నేతలు ఇప్పటికే బీజేపీకి టచ్లోకి వెళుతున్నారు. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.

టీఆర్ఎస్ లో పదవులు ఆశించి వచ్చిన నేతలు.. నామినేటేడ్ పదవులు రావని భావించే నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటంతో నేతలు ముందస్తుగా బీజేపీకి వెళితేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

కొద్దిరోజులుగా బీజేపీలోకి కాంగ్రెస్ తోపాటు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా వలసలు పెద్దఎత్తున మొదలయ్యాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పలువురు మాజీ ఎమ్మెల్యేలు.. మంత్రులు సంప్రదింపులు చేస్తున్నారు.

Also Read: కేసీఆర్ “లేట్” ప్లాన్: బీజేపీ కార్పోరేటర్లే టార్గెట్

బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. త్వరలోనే జమిలి ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో ఆలోగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది.

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ బలహీన పడిందని.. అధికారంలోని టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ యత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్