https://oktelugu.com/

అప్పుడు గుంపులో గోవింద పాత్ర‌లు.. ఇప్పుడు అన‌సూయ కోస‌మే ప్ర‌ధాన పాత్ర‌లు!

ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో ముందువరసలో ఉంటుంది హాట్ బ్యూటీ అనసూయ. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన ప్ర‌తిభ‌ ఉన్న అనసూయ.. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసింది. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోందీ అమ్మ‌డు. క్ష‌ణం, రంగ‌స్థ‌లం వంటి సినిమాల్లో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత క‌ద‌నం సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డి సినీ కెరీర్ మామూలుగా లేదు. […]

Written By:
  • Rocky
  • , Updated On : February 10, 2021 / 12:04 PM IST
    Follow us on


    ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో ముందువరసలో ఉంటుంది హాట్ బ్యూటీ అనసూయ. ఆకర్షించే అందంతోపాటు అద్బుతమైన ప్ర‌తిభ‌ ఉన్న అనసూయ.. టెలివిజన్ స్క్రీన్ పై తనదైన ముద్రవేసింది. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోందీ అమ్మ‌డు. క్ష‌ణం, రంగ‌స్థ‌లం వంటి సినిమాల్లో అద్భుత‌మైన క్యారెక్ట‌ర్ల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత క‌ద‌నం సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ అమ్మ‌డి సినీ కెరీర్ మామూలుగా లేదు. రాబోయే ఏడాదిలో దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల్లో అద్బుత‌మైన క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌బోతోంది.

    Also Read: ‘నాట్యం’ టీజర్ టాక్: నృత్యంతో కరిగించేస్తున్నారు

    అయితే.. ఇంత స్టార్ డ‌మ్ రాత్రికి రాత్రే వ‌చ్చింది కాదు. స‌గ‌టు సినీ న‌టుడి మాదిరిగా ఎన్నో క‌ష్టాలు, మ‌రెన్నో ఇబ్బందుల‌తోనే అన‌సూయ సినీ ప్ర‌యాణం మొద‌లైంది. తెలుగు అమ్మాయైన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి, మొద‌ట్లో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జాబ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.

    అయితే.. అంద‌రికీ అన‌సూయ అన‌గానే గుర్తుకు వ‌చ్చేది ‘జబర్దస్త్’ కామెడీ షో. న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న క్రమంలోనే అనసూయకు ఈ భారీ ఆఫర్ వచ్చింది. ఈటీవీ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ లో యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ షోలోకి ఎంటరైన షార్ట్ టైంలోనే సెలబ్రిటీగా మారిపోయింది అన‌సూయ‌.

    జబర్ధస్త్ కామెడీ షోతో వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉప‌యోగించుకున్న‌ అనసూయ.. సినిమా అవకాశాలనూ అందుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాల్లో నటించింది. క్షణం, రంగస్థలంలోని పాత్రలు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల్లో మంచి ఆఫ‌ర్లు కొట్టేసిందీ బ్యూటీ.

    Also Read: ‘కార్తీక దీపం’ అత్త గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు

    అయితే.. ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అనసూయ యాంకరింగ్ రంగంలో అడుగు పెట్టక ముందే సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ట్రై చేసింది. సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో గుంపులో గోవింద మాదిరిగా.. చిన్న చిన్న క్యారెక్టర్ల‌లో కూడా న‌టించింది. అప్ప‌ట్లో ఈ అమ్మడి పాత్రలకు ప్రాధాన్యం లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.

    అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “నాగ” చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో యాంకర్ అనసూయ కనిపించింది. అయితే అప్పటి అనసూయ ఫోటోని, ఇప్పటి ఫోటోని ప‌క్క ప‌క్క‌న పెట్టి చూస్తే.. నోరెళ్ల బెడ‌తారు అంద‌రూ. కాల క్ర‌మంలో జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డం.. ఆ త‌ర్వాత సినిమాల్లో మంచి మంచి రోల్స్ రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అందుకే అంటారు.. అదృష్టం ఏవైపు నుంచి త‌లుపు త‌డుతుందోన‌ని. అన‌సూయ సినీ జ‌ర్నీ చూస్తే అవున‌నే అనిపిస్తోంది క‌దూ..?!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్