https://oktelugu.com/

‘నాట్యం’ టీజర్ టాక్: నృత్యంతో కరిగించేస్తున్నారు

నృత్యం.. డ్యాన్స్.. దీని శక్తి అంతా ఇంతా కాదు.. నాలుగు చుక్కలేస్తే పండు ముసలోడైనా.. పదేళ్ల పోరాడైనా ఎగిరి గంతులు వేయాల్సిందే.. నాట్యానికున్న శక్తి అలాంటిది మరీ.. ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యరాజు ప్రధాన పాత్రలో నృత్యం ఆధారంగా రూపొందుతున్న స్ఫూర్తిదాయక డ్రామా చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకోండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ కూడా ఆయనే చేయడం విశేషం. తాజాగా ఈరోజు ఉదయం ‘నాట్యం’ టీజర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2021 / 11:42 AM IST
    Follow us on

    నృత్యం.. డ్యాన్స్.. దీని శక్తి అంతా ఇంతా కాదు.. నాలుగు చుక్కలేస్తే పండు ముసలోడైనా.. పదేళ్ల పోరాడైనా ఎగిరి గంతులు వేయాల్సిందే.. నాట్యానికున్న శక్తి అలాంటిది మరీ..

    ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యరాజు ప్రధాన పాత్రలో నృత్యం ఆధారంగా రూపొందుతున్న స్ఫూర్తిదాయక డ్రామా చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకోండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ కూడా ఆయనే చేయడం విశేషం.

    తాజాగా ఈరోజు ఉదయం ‘నాట్యం’ టీజర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. చిత్రం యూనిట్ ను అభినందించారు.

    ‘నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం’ అంటూ ఒక గురువు తన శిష్యురాలికి బోధించడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. సంధ్య రాజు కూచిపూడి డ్యాన్సర్ అయినా కూడా ఈ తొలి చిత్రంలో మంచి నటన, డ్యాన్స్ తో అలరించింది. దీనికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.

    ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవేంకటేశ్వర ఫిలింస్ తరుఫున విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు క్రేజ్ ఏర్పడింది.