
‘జాబిరెడ్డి’లాంటి హర్రర్, థ్రిల్లింగ్ కథాంశంతో మన ముందుకు వచ్చిన యువ హీరో తేజ సజ్జు మరో ప్రేమ కథను బేస్ చేసుకొని అల్లిన సస్పెన్ థ్రిల్లర్ తో ఈసారి రెండో ప్రయత్నం చేశారు. తేజ సజ్జు హీరోగా.. ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఇష్క్-నాట్ ఏ లవ్ స్టోరీ’. ఈ చిత్రం నుంచి టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణంలో ఎస్ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ కే మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మెగా హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు.
ఇష్క్ ట్రైలర్ చూస్తే హీరోహీరోయిన్ల మధ్య ఒక అందమైన ప్రేమకథగా మొదలవుతుందని అర్థమవుతోంది. పలు రోమాంటిక్ సీన్లు అలరించాయి. అయితే ఒక సంఘటనతో అంతా తలకిందులవుతుందని తెలుస్తోంది.
సడెన్ గా హీరోను వెంటాడుతుండడం.. అతడు పరిగెడుతూ తప్పించుకుంటుడడం.. దీనికి కారణం ఏంటనేది సస్పెన్స్ గా చూపించారు. ఇది ప్రేమకథ కాదు అని అనడం ఇంకా ఆసక్తిని కలిగిస్తోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ అంచనాలు పెంచేలా ఉంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందనేది వేచిచూడాలి
ట్రైలర్ ఇదే..