Mega Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ హీరోలు గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ పొందుతూ ఉంటాయి. అలాగే ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీ నుంచి అరడజన్ మందికి పైగా హీరోలు ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలందరిలో మెగా ఫ్యామిలీ హీరోలే ముగ్గురు ఉన్నారు. వాళ్ల ఇమేజ్ వల్ల వాళ్ల సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబడుతుంటాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలకి ఇండస్ట్రీలో ఎప్పుడు ఆదరణ దక్కుతుంది. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ హవా కొంత వరకు తగ్గిపోయింది.
ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించాడు… ఈ సినిమా సక్సెస్ తో మెగా అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సమ్మర్ కానుకగా మార్చి 26వ తేదీన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి హీరోగా చేస్తున్న ‘విశ్వంభర’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తో పాటుగా సమ్మర్ లోనే వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా సైతం ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొత్తంగా ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోలందరు వరుస పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద దండయాత్ర చేయబోతున్నారు.
ఈ సినిమాలను చూడడానికి మెగా అభిమానికి సిద్ధమవుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సంవత్సరం మెగా నామా సంవత్సరం అవుతుందా..? వీటిలో ఎన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
