spot_img
Homeఅంతర్జాతీయంIndia public holidays: ప్రపంచంలో అత్యధిక సెలవు దినాలు.. భారత్‌ స్థానం ఎంతో తెలుసా?

India public holidays: ప్రపంచంలో అత్యధిక సెలవు దినాలు.. భారత్‌ స్థానం ఎంతో తెలుసా?

India public holidays: ప్రపంచంలో ఆదివారం ఎక్కువ దేశాల్లో సెలవు ఉంటుంది. ముస్లిం దేశాల్లో శుక్రవారం సెలవు ఉంటుంది. వారానికి ఒక రోజు సెలవు తప్పనిసరి వీటితోపాటు ఐటీ సెక్టార్‌ వచ్చాక వారానికి ఐదు రోజులే పనిదినాలు వచ్చాయి. ఇక పండుగల సెలవులు వీటికి అదనం. విద్యాలయాలకు సీజన్‌ల వారీగా వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ సెలవులు ఎవరు తీసుకుంటున్నారు అనే అంశం పరిశీలిస్తే వివిధ మతాలు, సంస్కృతుల సమ్మేళనంతో భారత్‌ ప్రపంచంలోనే ఏడాదికి అత్యధిక గొప్ప సెలవు దినాలను అందిస్తోంది. ఫెడరల్‌ వ్యవస్థలో జాతీయ, ప్రాంతీయ పండుగలు కలిసి ఉద్యోగులకు అదనపు సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇది పని–జీవన సమతుల్యతకు ఉదాహరణగా మారుతోంది.

భారత్‌ 42పైగా సెలవులు..
భారత్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలు కలుపుకుంటే 42 రోజుల సెలవులు లభిస్తాయి. రాష్ట్రాలు స్థానిక ఉత్సవాలకు అదనపు రోజులు ప్రకటిస్తాయి, మొత్తం 50కి చేరుకునే అవకాశం ఉంది. ఆదివారాలు, రెండవ శనివారాలు కలిపితే ఏడాదికి 125 రోజుల పరిధిలో సెలవులు వస్తాయి. ఇది ప్రపంచంలోనే అధికం.

నేపాల్, ఇరాన్‌ తర్వాతి స్థానాలు..
నేపాల్‌ రెండో స్థానంలో ఉంది, హిందూ క్యాలెండర్‌ ప్రకారం 35 రోజులు సెలవులు ఇస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలకు ప్రాధాన్యత ఇస్తారు. మూడవ స్థానం ఇరాన్‌కి, మతపరమైన క్యాలెండర్‌లోని పండుగలు, సంవత్సరారంభానికి ఎక్కువ రోజులు కేటాయిస్తారు.

తర్వాతి స్థానాల్లో…
ఇక సెలవుల భారత్, నేపాల్, ఇరాన్‌ తర్వాత మయన్మార్‌లో భౌద్ధ పండుగలకు 26 రోజులు సెలవులు ఉన్నాయి. శ్రీలంకలో 25 రోజులు, దీపావళి, క్రిస్మస్, ఈద్‌లకు సెలవులు ఉన్నాయి. ఈ దేశాలు మత, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ సెలవులు ప్రకటిస్తాయి.

తక్కువ సెలవుల దేశాలు
ప్రపంచంలో అత్యంత తక్కువ సెలవు ఉన్న దేశాలు ఇలా ఉన్నాయ. బ్రిటన్‌ ఏడాది మొత్తంలో కేవలం 10 సెలవుల మాత్రమే ఇస్తుంది. తర్వాత నెదర్లాండ్స్‌ 9 వలవులు, సెర్బియా 9, మెక్సికో 8, వియత్నాం 6 సెలవులు మాత్రమే ఇస్తున్నాయి.

ఎక్కువ సెలవులు సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవిస్తాయి, కానీ పని ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయి. భారత్‌ వంటి దేశాలు ఫెడరల్‌ విధానంతో సమతుల్యత కల్పిస్తున్నాయి. భవిష్యత్తులో డిజిటల్‌ వర్క్‌ మోడల్స్‌ ఈ సెలవులను మరింత సమర్థవంతం చేయవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular