Anaganaga Oka Raju 5 Days Collections: నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం నిన్నటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసి సూపర్ హిట్ స్టేటస్ లోకి అడుగుపెట్టేసింది. నవీన్ పోలిశెట్టి లీగ్ లో ఉన్నటువంటి యంగ్ హీరోలు సూపర్ హిట్స్ ని అందుకోవడం ఎలాగో తెలియక తికమక పడుతున్నారు, ఎన్నో ఏళ్ళ నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి చాలా తేలికగా, అలవోకగా సూపర్ హిట్స్ ని అందుకుంటున్నాడు. స్టోరీ యావరేజ్ రేంజ్ లో ఉన్నా కూడా తన యాక్టింగ్ టాలెంట్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత ఆడియన్స్ అత్యధిక శాతం ‘అనగనగా ఒక రాజు’ చిత్రాన్ని చూసేందుకే మొగ్గు చూపించారు. విడుదలై 5 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల రూపాయిలకే పైగానే షేర్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కంటే మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయట. ఆదివారం రోజున 560 షోస్ కి గాను నార్త్ అమెరికా లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం $228K డాలర్స్ ని రాబడితే, ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కేవలం 500 షోస్ తో $220K డాలర్స్ ని రాబట్టింది. తక్కువ షోస్ ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాతో సమానంగా వసూళ్లు వచ్చాయి. ఒకవేళ ఎక్కువ షోస్ ఉండుంటే కచ్చితంగా డామినేట్ చేసి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి 5 రోజులకు కలిపి ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రం 7 కోట్ల 65 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 50 లక్షలు, గుంటూరు నుండి కోటి 75 లక్షలు, కృష్ణా జిల్లా నుండి కోటి 37 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 2 కోట్ల 48 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 1 కోటి 40 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 87 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 22 కోట్ల 17 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 20 లక్షలు, ఓవర్సీస్ నుండి 7 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, ఓవరాల్ 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల 57 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిల్చింది.
