Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఈ ఏడాది వంటి విచారకరమైన ఏడాది ఆయన జీవితం లో ఇంతకు ముందు ఎన్నడూ కూడా చూసి ఉండదు అని చెప్పొచ్చు..ఎందుకంటే ఆయన సోదరుడు రమేష్ బాబు మరియు ఆయన తల్లి ఇందిరా దేవి గారు ఒకే ఏడాది లో స్వర్గస్తులు అవ్వడం మహేష్ బాబు హృదయాన్ని కలిచివేసింది..వీళ్ళిద్దరితో చిన్నప్పటి నుండి మహేష్ బాబు కి ఉన్న సాన్నిహిత్యం వేరు..మహేష్ చిన్నతనం లో రమేష్ బాబు తండ్రి తర్వాత తండ్రిలాగా నిలిచి తన బాగోగులు చూసుకునేవారు.

ఇక తల్లి ఇందిరా దేవి గారితో మహేష్ కి ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతిరోజు ఆమెని చూడనిదే మహేష్ రోజు గడవదు..అలా తన జీవితం లో ఎంతో ఇష్టమైన ఈ ఇద్దరు ఒకేసారి మహేష్ ని వదిలి వెళ్లడం ఆయన మనసుకి ఎంత బాధ కలిగించి ఉంటుందో ఊహించుకోవచ్చు..అందుకే మహేష్ గత కొంత కాలం నుండి ఎవ్వరిని కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు.
తల్లి ఇందిరా దేవి గారి తదనంతరం ఆమెకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్దం గా పూర్తి చేసిన మహేష్ బాబు..ఆ బాధ నుండి బయటకి రావడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు..మొన్నీమధ్యనే ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న మహేష్ బాబు..ఆ మరుసటి రోజు నుండి ఒంటరిగా విదేశాలకు ప్రయాణమయ్యాడు..అక్కడ ఒక ఫైవ్ హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకొని కుటుంబం తో కూడా లేకుండా ప్రశాంతంగా ఒక్కడే ఉంటున్నాడు..మహేష్ బాబు ఇలా కుటుంబంతో దూరంగా ఒంటరిగా విదేశాలకు వెళ్లడం ఇది వరుకు ఎప్పుడు కూడా జరగలేదు.

ఎప్పుడైనా ఆయన టూర్ కి వెళ్లాల్సి వస్తే కుటుంబం కచ్చితంగా పక్కన ఉండాల్సిందే..కానీ మొదటిసారి ఆయన ఫామిలీ ని పక్కనపెట్టి విదేశీ పర్యటన చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..కొన్ని రోజులు అక్కడ చిల్ అయిన తర్వాత ఇండియా కి తిరిగి వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని వార్తలు వినిపిస్తున్నాయి..ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.