Sardar Collections: తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ చిత్రం ఇటీవలే దీపావళి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సరికొత్త కథాంశం తో స్పై థ్రిల్లర్ గా డైరెక్టర్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది..ఈ ట్రైలర్ అద్భుతంగా ఉండడం తో అక్కినేని నాగార్జున వెంటనే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసి ఘనంగా విడుదల చేసాడు.

ఈ సినిమాకి మూడు సినిమాలు పోటీగా వచ్చినప్పటికీ కూడా విజయం మాత్రం సర్దార్ నే వరించింది..ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున గారు 5 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసాడు..మొదటి రోజు 93 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు నుండి మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ రన్ ని కొనసాగిస్తుంది.
ఇప్పటి వరుకు ఈ సినిమా విడుదలై 5 రోజులు పూర్తి అవ్వగా, ఈ 5 రోజులకు గాను తెలుగు వెర్షన్ లో రోజు వారీగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అంటే..మొదటి రోజు సుమారుగా 93 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి, రెండవ రోజు కోటి 5 లక్షల రూపాయిలు..మూడవ రోజు కోటి 48 లక్షల రూపాయిలు..నాల్గవ రోజు కోటి 32 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా..5 వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ ని రాబట్టి కార్తీ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

.ఇదే స్టడీ రన్ ని ఈ సినిమా ఫుల్ రన్ లో కూడా కొనసాగిస్తే కేవలం తెలుగు వెర్షన్ నుండే 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్..10 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..అలా కార్తీ చాలా సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టేసాడు.