Tamil Heroes: తమిళ్ హీరోల మార్కెట్ తెలుగు లో బాగా పెరుగుతోందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మన సినిమాల మీదే ఫోకస్ చేసి తెలుగులో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు.

Written By: Gopi, Updated On : March 16, 2024 12:56 pm

Tamil-Heroes

Follow us on

Tamil Heroes: ఒకప్పుడు తమిళ హీరోలు తెలుగులో వాళ్ల సినిమాలను డబ్ చేస్తూ వరుస విజయాలను అందుకున్నారు. దాని ద్వారా వాళ్ళ మార్కెట్ తెలుగులో విపరీతంగా పెరుగుతూ వచ్చింది.ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళ తర్వాత జనరేషన్ లో ఉన్న హీరోలు కూడా ఇక్కడ వాళ్ళ సినిమాను రిలీజ్ చేస్తూ స్టార్లుగా ఎదిగుతూ వస్తున్నారు. అయితే మన వాళ్ళ సినిమాలు మాత్రం తమిళం లో రిలీజ్ చేస్తే అక్కడ ఉన్న జనాలు అసలు వాటిని పట్టించుకునే వారు కాదు.

ఇక్కడ సూపర్ హిట్ అయిన మన సినిమాలు అక్కడ మాత్రం డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు మన సినిమాల మీదే ఫోకస్ చేసి తెలుగులో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం మన తెలుగులో బీభత్సమైన సినిమాలు రిలీజ్ చేస్తూ వాళ్ళు భారీ హైప్ ని తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది.

ఇక తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు అనేది అందరికీ అర్థం అయింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళ్ హీరోలు అయిన రజినీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలు తెలుగులో మార్కెట్ ని భారీ గా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుకునే వాళ్ళ సినిమాలని తెలుగులో రిలీజ్ చేస్తూ మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగులో కూడా పాగా వేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ హీరోలందరూ మన వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ మన దర్శకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో కామ్ గా ఉంటున్నారు. అయిన కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలా ట్రెండ్ నడుస్తుంది.

కాబట్టి ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే ఇండియా వైడ్ గా ఆ సినిమాకి మంచి గుర్తింపు అయితే వస్తుంది… కానీ తమిళ్ హీరోలు మాత్రం ఇప్పటికి ఓన్లీ తెలుగు మీదనే ఎక్కువ ఫోకస్ చేసి తెలుగులో సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి…