Krishna Vamsi-Puri Jagannadh: పూరి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు కృష్ణ వంశీ ఏం చెప్పాడో తెలుసా..?

కృష్ణవంశీ కూడా పూరి జగన్నాథ్ తో నేను కూడా ఇంటిదాకా వచ్చి నిన్ను డ్రాప్ చేస్తా పద అని ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారట. ఇలా వెళుతున్న క్రమంలో కృష్ణవంశీ పూరి జగన్నాథ్...

Written By: Gopi, Updated On : March 16, 2024 12:55 pm

Krishna Vamsi and Puri Jagannadh

Follow us on

Krishna Vamsi-Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పూరి జగన్నాథ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. తిని తినక ఎన్నో కష్టాలు పడి సినిమా చేయాలనే భారీ సంకల్పంతో ముందుకు కదులుతూ ఉండేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ కి ఒక సినిమా ఓకే అయింది. అది స్టార్ట్ కూడా అయింది. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. దాంతో పూరి తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక అప్పుడు తన ఫ్రెండ్ అయిన కృష్ణవంశీతో ఇండస్ట్రీ వదిలి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇక ఇక్కడ ఉండటం నా వాళ్ల కాదని చెప్పాడట.

దాంతో కృష్ణవంశీ కూడా పూరి జగన్నాథ్ తో నేను కూడా ఇంటిదాకా వచ్చి నిన్ను డ్రాప్ చేస్తా పద అని ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారట. ఇలా వెళుతున్న క్రమంలో కృష్ణవంశీ పూరి జగన్నాథ్ కి దైర్యన్నిచ్చే కొన్ని మాటలు చెప్పాడట. అక్కడ కనిపించే దృశ్యాలను చూపిస్తూ జీవితం అంటే ఎలా ఉంటుందో వివరిస్తూ, ఆయన చెప్పిన కొన్ని మాటల వల్లే పూరి ఊర్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కి రిటర్న్ ట్రైన్ ఎక్కి వచ్చారట. ఇక ఇక్కడికి వచ్చి తీవ్రమైన ప్రయత్నం చేస్తుండగా,పవన్ కళ్యాణ్ తో ఆయనకి సినిమా ఓకే అయింది. అలా పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కృష్ణవంశీ కనక ఆయనకు మోటివేట్ చేయకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ను కోల్పోయి ఉండేదని కృష్ణవంశీ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు…

ఇక మొత్తానికైతే పూరి పాన్ ఇండియా డైరెక్టర్ గా తన సత్తా చాటుతూ వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు రామ్ తో ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తూ తను చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా మరోసారి తన హవాని కొనసాగించాలని చూస్తున్నాడు…