https://oktelugu.com/

Chiranjeevi: చిరంజీవి ని ఇండస్ట్రీ పెద్ద గా చేయబోతున్నారా..? దీనివల్ల ఎవరికి లాభం…

Chiranjeevi: ఎప్పుడైతే ఆయన మరణించారో అప్పటినుంచి ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్ద అనేవారు లేరు. అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 18, 2024 / 10:55 AM IST

    Is the industry going to make Chiranjeevi big

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం పాటు దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించారు. అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది దొరికేది. ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలకి మాత్రం తను చాలా చేసేవాడు. చిన్న సినిమాలకి థియేటర్లు దొరక్కపోయిన పెద్ద సినిమాల నుంచి ఎదురయ్యే డామినేషన్లను తట్టుకోవడానికైనా వాళ్ళకి మోరల్ గా సపోర్ట్ ఇస్తూ వాళ్ల సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించేవాడు.

    ఇక ఎప్పుడైతే ఆయన మరణించారో అప్పటినుంచి ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెద్ద అనేవారు లేరు. అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది పడితే అది చేస్తున్నారు దానివల్ల ప్రేక్షకుడిలో సినిమా ఇండస్ట్రీ పైన కొంచెం చులకన భావం అయితే ఏర్పడుతుంది. అదే ఒక ఇండస్ట్రీ పెద్ద అనేవాడు ఉండి ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళందరిని హ్యాండిల్ చేసుకుంటూ రాగలిగితే ఇండస్ట్రీ ఒక తాటి పైన నడిచే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    Also Read: Harish Shankar: హరీష్ శంకర్ చేసిన పనికి డిజప్పాయింట్ అవుతున్న అభిమానులు.. కారణం ఏంటంటే..?

    ఇక ఇండస్ట్రీ పెద్దగా దాసరి గారి తర్వాత చిరంజీవి అయితేనే బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేసినప్పటికీ దానిమీద మోహన్ బాబు మాత్రం వ్యతిరేకతని తెలియజేశాడు. అందువల్లే ఇండస్ట్రీ పెద్ద అనే వ్యవహారం అక్కడితోనే ఆగిపోయింది. నిజానికి చిరంజీవి అయితేనే అందరిని ఏకతాటిపైకి తీసుకురాగలరు అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇక టికెట్ల రేట్ తగ్గించినప్పుడు చిరంజీవి స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కొరటాల శివ లాంటి డైరెక్టర్లని తీసుకొని జగన్ దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడారు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 వాయిదా… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ మరొక బ్యాడ్ న్యూస్!

    ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక ఇదే క్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ గా అయిన సినిమా పరంగా అయిన చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా ఎంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అదే పని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి కనక ఇండస్ట్రీ పెద్ద అయితే మాత్రం కచ్చితంగా చిన్న సినిమాలకు న్యాయం జరుగుతుంది అంటూ చిన్న సినిమాల నిర్మాతలు కూడా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…