Harish Shankar: హరీష్ శంకర్ చేసిన పనికి డిజప్పాయింట్ అవుతున్న అభిమానులు.. కారణం ఏంటంటే..?

Harish Shankar: రవితేజతో చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. 'షో రీల్ ' పేరిట ఒక టీజర్ ని రిలీజ్ చేశారు.

Written By: Gopi, Updated On : June 18, 2024 10:46 am

Disappointed fans of Harish Shankar work

Follow us on

Harish Shankar: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇక వాళ్లలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన ఇప్పటికే చాలా సినిమాలు చేసి మంచి సక్సెస్ లను అందుకొని ఉన్నాడు. ఇక అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా అయితే సూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా హరీష్ శంకర్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. అయితే అందరికీ కమర్షియల్ సినిమాలు తీయడం అనేది రాదు. ఒకవేళ తీసిన కూడా ఆ సినిమాలు సరిగ్గా ఆడవు.

ఎందుకంటే దానికి సరైన మీటర్ ప్రకారం సినిమాలను చిత్రీకరిస్తే తప్ప ఆ సినిమాలనేవి ప్రేక్షకుల మీద అంత ఇంపాక్ట్ చూపించవు. కాబట్టి ఆ సినిమాలను ఎంచుకొని కూడా హరీష్ శంకర్ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాడు అంటే నిజంగా అతని టాలెంట్ ను మనం మెచ్చుకోవాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన రవితేజతో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ‘షో రీల్ ‘ పేరిట ఒక టీజర్ ని రిలీజ్ చేశారు.ఇక ఈ టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో నింపేశారు. ఇక ఇందులో ఒక్క డైలాగ్ కూడా వాడకుండా ఓన్లీ యాక్షన్ మాత్రమే చూపించారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయా..?

ఇక ఈ షో రీల్ అనేది ప్రేక్షకుల మీద మంచి ఇంపాక్ట్ ని చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే హరీష్ శంకర్ ఈ సినిమా ని ఎలా తీస్తున్నాడు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ చాలామంది రవితేజ, హరీష్ శంకర్ అభిమానులు మాత్రం కొంతవరకు నిరాశ చెందారు. ఎందుకంటే హరీష్ శంకర్ మార్క్ లో ఈ సినిమా నుంచి కొన్ని డైలాగులను వదిలితే విని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.

Also Read: Mr.Bachchan Teaser Review : మిస్టర్ బచ్చన్ టీజర్ రివ్యూ : నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్, అంచనాలు పెంచేసిన రవితేజ!

కానీ వాళ్లకి నిరాశే ఎదురయింది. కాబట్టి ఈ టీజర్ మీద కొంతమంది నెగిటివ్ ఇంప్రెషన్ ని చూపిస్తుంటే మరి కొంతమంది మాత్రం పాజిటివ్ గా స్పందిస్తున్నారు… హరీష్ శంకర్ అంటే డైలాగులకు కేరాఫ్ అడ్రస్ కాబట్టి ఒక డైలాగ్ వదిలితే బాగుండేది అని కూడా చాలా మంది అంటున్నారు.