https://oktelugu.com/

Pawan, Allu Arjun: ఈ ఒక్క దెబ్బతో పవన్, అల్లు అర్జున్ మధ్య దూరం తగ్గినట్టే?

Pawan, Allu Arjun:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి మెగా హీరో కూడా పవన్ ను తలుచుకుంటారు. మెగా హీరోల ఫంక్షన్లలో పవన్ నామస్మరణ ఎక్కువగా ఉంటుంది. అయితే అప్పట్లో పవన్ పవన్ అని తన సినిమా ఫంక్షన్ లో అరిచిన ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ ఫంక్షన్లకు రాకుంటే మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారన్నట్టుగా కసురుకున్నాడు. ఇక అప్పటి […]

Written By: , Updated On : September 2, 2021 / 01:39 PM IST
Follow us on

Is The Distance Between Pawan and Allu Arjun Reduced?

Pawan, Allu Arjun:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి మెగా హీరో కూడా పవన్ ను తలుచుకుంటారు. మెగా హీరోల ఫంక్షన్లలో పవన్ నామస్మరణ ఎక్కువగా ఉంటుంది. అయితే అప్పట్లో పవన్ పవన్ అని తన సినిమా ఫంక్షన్ లో అరిచిన ఫ్యాన్స్ పై అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ ఫంక్షన్లకు రాకుంటే మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారన్నట్టుగా కసురుకున్నాడు.

ఇక అప్పటి నుంచి పవన్ ఫ్యాన్స్ మొత్తం అల్లు అర్జున్ పై పడి ఆయన సినిమాలు ,ట్రైలర్, లుక్ లపై నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ వివాదం పవన్ వర్సెస్ అల్లు అర్జున్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ కు దూరం చేసింది. బోలెడంత చర్చ, రచ్చ నడిచింది. పవన్-అల్లు అర్జున్ మధ్య మధ్యలో కలిశారు కానీ ఆ ఎఫెక్షన్, ఎమోషన్ మాత్రం బయటకు సానుకూలంగా రిప్లెక్ట్ కాలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన నేడు ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి సైతం తన తమ్ముడిని పొగుడుతూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం ఓ ట్వీట్ చేశాడు. ‘ఈ ఏడాది పవన్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు’ బన్నీ. ఈ ట్వీట్ పవన్ ఫ్యాన్స్ ను కాస్త కూల్ చేసిందనే చెప్పాలి.

హీరోల మధ్య గ్యాప్ లు రావడం సహజమే.. కానీ ఒకే మెగా హీరోల మధ్య రావడం అనేది మెగా అభిమానుల్లోనే విభజన తెచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ తో ఈ విభేదాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి బన్నీ తన వైపు నుంచి లైన్ క్లియర్ చేసుకున్నాడనే చెప్పాలి.. పవన్ ఫ్యాన్స్ కు ఈ ట్వీట్ తో సమాధానం ఇచ్చినట్టే అర్థం చేసుకోవాలి..