Pawan Kalyan Craze : నరనరాల్లో పవనిజం నిండే రోజులు వస్తాయి !

Pawan Kalyan Craze: పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan) పుట్టినరోజు నీరాజనాలు చెబుతూ ఒకపక్క ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోపక్క పవన్ పై అనేక విమర్శలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘ఏ‌బి‌సి‌డి‌లు రాని వ్యక్తి ఇంగ్లీష్ లిటరేచర్ లో పీహెచ్డి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ పవన్ ను విమర్శిస్తున్నారు. ఓనమాలు కూడా రాని వాడు సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ […]

Written By: admin, Updated On : September 2, 2021 1:58 pm
Follow us on

Pawan Kalyan Craze: పవన్ కళ్యాణ్ కు ( Pawan Kalyan) పుట్టినరోజు నీరాజనాలు చెబుతూ ఒకపక్క ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేస్తున్నారు. మరోపక్క పవన్ పై అనేక విమర్శలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘ఏ‌బి‌సి‌డి‌లు రాని వ్యక్తి ఇంగ్లీష్ లిటరేచర్ లో పీహెచ్డి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ పవన్ ను విమర్శిస్తున్నారు. ఓనమాలు కూడా రాని వాడు సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మంచిని మెచ్చుకోకపోయినా పర్వాలేదు గానీ, వ్యతిరేకించకూడదు. పవన్ కి ఏం వచ్చు, ఏమి రావు అనేది పక్కన పెట్టండి. ఏభై కోట్ల హీరో, ఏడాది వందల కోట్ల రూపాయల సంపాదన వదిలేసి జనం కోసం వచ్చిన నిజమైన హీరో. పవన్ గురించి చాలామంది చెప్పే మాట ‘ఇంత మంచివాడు, మొహమాటస్తుడు రాజకీయాలలో పనికి రాడు’ అని.

అంటే దుష్టులు నీచులు మాత్రమే రాజకీయాలు చేయాలా?. పవన్ పై ఉన్న ఇంకో బలమైన విమర్శ.. తన దుకాణాన్ని పక్క దుకాణంలో కలిపేసి.. ఏవేవో సరుకులు తీసుకుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు అని. నేడు అన్నీ దుకాణాల్లో కల్లా… ఎక్కువ లాభాలు ఇస్తోన్న దుకాణం పవన్ దే. ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తే.. రెండు వందల కోట్లు ఆదాయం.

పవన్ సినీ నిర్మాణం కూడా మొదలు పెడితే.. ప్రతి హీరో ఫ్రీగా వచ్చి సినిమా చేస్తాడు. అంటే.. ఏడాదికి వేయి కోట్లు సంపాదించే స్థాయి ఉన్నవాడు పవన్. అలాంటి వాడు చిల్లర కోసం కక్కుర్తి పడ్డాడని ఎలా అనుకుంటారు ? తన కోట్లాది మంది అభిమానుల కోసం సినిమాలు చేసినా చాలు కదా.

ఇప్పటి రాజకీయాలలో ఏం చేయాలో తెలీకో , వేరే మార్గమేమీ లేక ఏదో రాజకీయం కోసం రాజకీయాలు చేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అనే ఆలోచనతో వచ్చిన ఒక శక్తినే పవన్ అనే వ్యక్తి. జనాల నరనరాల్లో పవనిజం (, Pawanism) నిండిపోయే రోజులు త్వరలోనే రానున్నాయి.