https://oktelugu.com/

Nurse Jobs: విదేశాలలో నర్సు ఉద్యోగ ఖాళీలు.. నెలకు 2.50 లక్షల వేతనంతో?

తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్ధ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. విదేశాలలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంగ్లాండ్ లోని ఆస్పత్రులలో నెలకు 2 లక్షల నుండి 2.50 లక్షల వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డిప్లోమా, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన పురుషులు, స్త్రీలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనంతో పాటు భోజనం, లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్, విమాన టికెట్లను ఇతర […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 2, 2021 1:39 pm
    Follow us on

    తమిళనాడు రాష్ట్ర విదేశీ ఉపాధి కల్పన సంస్ధ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. విదేశాలలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంగ్లాండ్ లోని ఆస్పత్రులలో నెలకు 2 లక్షల నుండి 2.50 లక్షల వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. డిప్లోమా, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన పురుషులు, స్త్రీలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    వేతనంతో పాటు భోజనం, లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్, విమాన టికెట్లను ఇతర దేశాల ఉపాధి సంస్థల వారు ప్రత్యేకంగా అందజేస్తారు. www.omcmanpower.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 0 4 4 – 2 2 5 0 5 8 8 6 /22 502267 నంబర్ల ద్వారా విదేశీ ఉపాధి కల్పన సంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు కువైట్ లో డ్రైవర్ గా పని చేసేవాళ్లకు ఉద్యోగాలు ఉన్నాయి. పది పాసై 30 సంవత్సరాల వయస్సు నుంచి 43 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాలోని హోటల్స్‌లో వంట మనిషి (పురుషులు) ఉద్యోగ ఖాళీలు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 27 వేల రూపాయల నుంచి 34 వేల రూపాయల వరకు వేతనం పొందవచ్చు.

    కువైట్ లో ఇంటి పనులు చేయడానికి 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ఉద్యోగ ఖాళీలు ఉండగా 32,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఓమన్ దేశంలో క్యాస్టింగ్‌ / ఇన్స్‌పెక్షన్‌ /మెకానిక్‌ ఆపరేటర్లుగా పని చేసే వాళ్ల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వాళ్లకు నెలకు 29,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. పైన పేర్కొన్న వెబ్ సైట్, ఫోన్ నంబర్ల ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.