‘అర్జున్ రెడ్డి’ సినిమా తో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక ఐడెంటిటి సంపాదించుకున్నాడు. తన మాటలతో, యాక్టింగ్ తో సగటు ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకున్నాడు…ఈ మధ్యకాలంలో వరుసగా ప్లాప్ సినిమాలు రావడం వల్ల ఆయన కొంతవరకు తగ్గాడు లేకపోతే ఇప్పటికే టైర్ వన్ హీరోగా ఎదిగేవాడు. అలాంటి హీరో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్త పడుతున్నాడు… విజయ్ దేవరకొండ ఎన్ని పాత్రలు చేసిన కూడా ఆయన డ్రీమ్ రోల్ ఒకటైతే ఉందట. హిస్టారికల్ సినిమాలో నటించాలనేది తాజా డ్రీమ్ అంటూ ఆయన గతంలో ఒకసారి తెలియజేశాడు. హిస్టారికల్ పాత్రలో రాజుగా చేసి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ‘కింగ్ డమ్’ సినిమాలో రాజుగా కనిపించినప్పటికి అది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు.
ఫుల్ లెంత్ సినిమాలో తను రాజుల నటించి తన రాజ్యాన్ని కాపాడడానికి యుద్ధం చేస్తుంటే అది చాలా కిక్కిస్తుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొత్తానికైతే తన అభిమానులు సైతం విజయ్ అలాంటి పాత్ర చేస్తే చూడటానికి వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో విజయ్ నుంచి భారీ కంబ్యాక్ ను కోరుకుంటున్నారు.
కాబట్టి ఇప్పుడు చేస్తున్న ‘రౌడీ జనార్దన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా కేర్ తీసుకుంటున్నాడు… ఇంతకు ముందు వరకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు కంటెంట్ ను బట్టి ముందుకు సాగుతున్నాడు. ఎప్పుడైతే కంటెంట్ ను నమ్ముకొని ముందుకు సాగుతారో అప్పుడు తప్పకుండా సక్సెస్ వస్తోందనేది వాస్తవం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ అదే బాటలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో తన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు ఉండరనే రీతిలో ఒక ఎగ్జంపూల్ ను సెట్ చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు…తన డ్రీమ్ రోల్ ను ఎప్పుడు చేస్తాడు, ఆ పాత్రలో ప్రేక్షకులను మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…