Rajamouli success formula: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రాజమౌళి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసేలా సినిమాలను చేయగలిగే ఏకైక దర్శకుడు కూడా తనే కావడం విశేషం…బాహుబలి సినిమాతో పాన్ ఇండియాని షేక్ చేశాడు… ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పెట్టి ‘త్రిబుల్ ఆర్’ లాంటి భారీ మల్టీ స్టారర్ సినిమాను చేశాడు…ఆయన చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన ‘జేమ్స్ కామెరూన్’ సైతం ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…
రాజమౌళి చేసే సినిమాలు మాత్రమే ఎందుకు సక్సెస్ సాధిస్తున్నాయి. ఇతర డైరెక్టర్లు చేసే సినిమాలు ఏదో ఒక లోపంతో ఏదో ఒక సినిమా అయిన ఫ్లాప్ అవుతోంది. కానీ రాజమౌళి చేసిన 12 సినిమాలు మాత్రం సూపర్ సక్సెస్ ని సాధించాయి. ఆయన సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగా నిలిచాయి.
ప్రతి సినిమాలో భారీ ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. దానివల్ల సినిమా ప్రేక్షకులందరికి నచ్చుతోంది. ఏదైతే ఎమోషన్ ను సినిమాతో చెప్పాలనుకుంటాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు. కాబట్టి అతనికి సక్సెస్ లు దక్కుతున్నాయని మరి కొంత మంది చెప్తున్నారు. ఆయన విషయంలో ఇది ఇప్పుడు తేడా కొట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఒక రోజులో 24 గంటలు సినిమా గురించి ఆలోచిస్తాడు.
కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన ఎమోషన్, ఎలివేషన్ ఎలా ఉండాలి. దానికి జస్టిఫికేషన్ ఎలా ఉంటే ప్రేక్షకులకు నచ్చుతోంది అనే ధోరణిలో దాన్ని ఒకటికి పది రకాలుగా ఆలోచించి సినిమాని చేస్తూ ఉంటాడు. అందుకే అతనికి ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది… ఆయనలా కష్టపడి ఆయనలా సినిమాలను తెరకెక్కిస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు అంటూ కొంతమంది సినిమా మేధావులు చెబుతున్నారు…