Mahesh Babu Father Character: మహేష్ బాబు(superstar Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం షూటింగ్ చప్పుడు లేకుండా, చకచకా జరిగిపోతోంది. ఊపు చూస్తుంటే రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి అయిన సినిమాగా ఈ ప్రాజెక్ట్ నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే , ఈ సినిమాలో నటించే నటీనటులు దాదాపుగా ఖరారు అయ్యారు. అయితే మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం చాలా పెద్ద రీ సెర్చ్ జరిగింది. ముందుగా ఈ క్యారక్టర్ ని అక్కినేని నాగార్జున తో చేయించాలని అనుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమిళ స్టార్ హీరోలలో ఒకరైన చియాన్ విక్రమ్ ని కూడా ని సంప్రదించారట. కానీ ఈ క్యారక్టర్ నాకు సరిపడదు అని ఆయన కూడా రిజెక్ట్ చేసాడట.
ఇక రీసెంట్ గానే మూవీ టీం మాధవన్ ని సంప్రదించారు . ఆయన నటించడానికి ఒప్పుకున్నాడు, లుక్ టెస్టులు కూడా జరిగాయి. లుక్ టెస్ట్ చేసిన తర్వాత రాజమౌళి కి సంతృప్తి లేకపోవడం ఆయన్ని కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారు. ఇక చివరికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ని సంప్రదించి, ఆయనకు లుక్ టెస్ట్ చేసిన తర్వాత, రాజమౌళి విజన్ కి మ్యాచ్ అవ్వడం తో వెంటనే ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్రకు తీసుకున్నారు. నేడు ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టాడట. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి చేసిన చిత్రాల్లో అత్యధిక శాతం సూపర్ హిట్ అయ్యినవే ఉన్నవి. మహేష్ బాబు సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్, తండ్రి క్యారెక్టర్స్ కూడా చేస్తూ వచ్చాడు.
దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహర్షి వంటి చిత్రాల్లో మహేష్ బాబు కి తండ్రి గా నటించిన ప్రకాష్ రాజ్, ఇప్పుడు మరోసారి ఆయనకు తండ్రి క్యారెక్టర్ చేయబోతున్నాడు. చూడాలి మరి వీళ్లిద్దరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ రీ క్రియేట్ చేయబోతుంది అనేది. ఇకపోతే రాజమౌళి కి ఇది ప్రకాష్ రాజ్ తో రెండవ సినిమా అని చెప్పొచ్చు. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక చిత్రం ‘విక్రమార్కుడు’. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీల్లిద్దరు కలుస్తున్నారు. చూడాలి మరి ఇంతమంది సెట్ అవ్వని ఆ రోల్ ప్రకాష్ రాజ్ కి ఎలా సెట్ అయ్యింది?, అందులో అంత స్పెషాలిటీ ఏముంది అనేది.