https://oktelugu.com/

Khushi 2 movie : అకిరా నందన్ తో ఎస్ జే సూర్య ‘ఖుషి 2’ సినిమా చేయబోతున్నారా..?

ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు సూపర్ సక్సెస్ లను అందుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పుడు కూడా తమదైన రీతిలో భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది...ఇక పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ విస్తరిస్తున్న సమయాన మన హీరోలు వాళ్ల సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఏర్పడనుంది...

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2025 / 09:19 PM IST
    Follow us on

    Khushi 2 movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎస్ జె సూర్య లాంటి దర్శకుడు సైతం నటుడిగా మారి మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటున్నాడు.ఇక ఇప్పటికే ఆయనకు ఒక ‘నేషనల్ అవార్డు’ కూడా రావడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ ఈవెంట్ లో తలుక్కున మెరిసిన ఆయన రీసెంట్ గా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలైతే తెలియజేశాడు. ముందుగా పవన్ కళ్యాణ్ కి తనకు మంచి బాండింగ్ ఉందని చెప్పాడు. అలాగే ఖుషి సినిమా సమయంలో ఆయన ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడని చెప్పాడు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన గురించి మాట్లాడడం తనకు చాలా హై ఫీల్ ఇచ్చిందని చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు నువ్వు మంచి డైరెక్టర్ ఎందుకు డైరెక్షన్ ఆపేసావు అనడంతో ఒకసారిగా నా రోమాలు నిక్క పొడిచినట్టుగా అనిపించాయి అంటూ ఆయన సమాధానం అయితే చెప్పాడు…

    ఇక దాంతోపాటుగా తను ఎప్పటికైనా నటుడు అవ్వాలనే ఉద్దేశ్యంతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చానని ఒక నిజాన్ని కూడా తెలియజేశాడు. కానీ దర్శకుడిగా ముందు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నటుడిగా కెరియర్ బాగుంటుందనే ఉద్దేశ్యంతో అలా చేశానని చెప్పాడు. ఇక శంకర్ గారి సినిమాలో నటించడం అనేది తనకు డ్రీమ్ అని కానీ అంత ఈజీగా శంకర్ సినిమాలో అవకాశం అయితే రాదని తనకు ముందుగానే తెలుసని చెప్పాడు.

    ఇక అందువల్లే ముందుగా మంచి సినిమాలను చేసి ఆ తర్వాత శంకర్ ను ఆకర్షించి తన సినిమాలో అవకాశం దక్కించుకున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో విలన్ గా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో తను తీస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో కూడా తనకు విలన్ గా ఆపర్చునిటీ ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు… ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నప్పుడు అకిరానందన్ ను చూశానని తను కూడా పవన్ కళ్యాణ్ లాగే బుక్స్ బాగా చదువుతూ ఉంటాడేమో అందుకే నేను చూసినప్పుడు బుక్ చదువుకుంటూ కూర్చున్నాడని సమాధానం చెప్పాడు.

    ఇక దాంతో పాటుగా ఖుషి 2 సినిమా ఒక వేళ చేయాల్సివస్తే అకీరా తో చేస్తానేమో చూడాలి అంటూ సమాధానమైతే చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన బిజీ నటుడిగా కొనసాగుతున్నాడు. కాబట్టి ఇక మీదట ఆయన డైరెక్షన్ చేసే అవకాశమైతే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనక ‘ఖుషి 2’ సినిమాని అకీరా నందన్ తో చేయమని చెబితే అప్పుడు చేస్తాడేమో అనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి…