https://oktelugu.com/

Poonam Kaur : త్రివిక్రమ్ మీద పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ఎట్టకేలకు ‘మా’ నుంచి స్పందన ఇదీ…

మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ల మీదనే వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 5, 2025 / 09:10 PM IST

    Poonam Kaur

    Follow us on

    Poonam Kaur : సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాణించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తద్వారా టాలెంట్ ఉన్నవాళ్లకు కూడా అదృష్టం కలిసి రాకపోవడం వల్ల గానీ, వాళ్లకు సరైన సినిమాలు పడకపోవడం వల్ల గానీ ఇండస్ట్రీలో వెనుకబడిపోతున్నారు. ఇక పెద్దగా టాలెంట్ లేని కొంతమంది నటులు కూడా టైమ్ బాగుండటం వల్ల స్టార్లు గా ఎదుగుతూ ఉంటారు… గత కొన్ని సంవత్సరాల నుంచి పూనమ్ కౌర్ త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ కొన్ని కమెంట్లైతే వస్తున్నారు. నిజానికి ఆమెకు త్రివిక్రమ్ కి మధ్య ఎలాంటి సంబంధం ఉంది. ఆమె ఎందుకని త్రివిక్రమ్ ఎప్పుడు దూషిస్తూ అతన్ని తిడుతూ వస్తుందనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. నిజానికి వాళ్ల మధ్య పర్సనల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరమైతే ఉంది. అలా కాదని ఆమె ట్వీట్ ల మీద ట్వీట్లు చేసినంత మాత్రాన ఉపయోగమైతే ఉండదు అంటూ సదరు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆమె త్రివిక్రమ్ పైన ఫైర్ అవుతూ గతం లో నేను MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) లో ఆయన మీద కంప్లైంట్ చేశాను.

    అయినప్పటికీ వాళ్ళు ఎవరు దానిమీద యాక్షన్ అయితే తీసుకోలేదు అంటూ ఒక ట్వీట్ చేసింది. ఇక దానికి మా ట్రెజరరీ మెంబర్ అయిన శివ బాలాజీ స్పందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత మాత్రాన ఏది అయిపోదు. ఇప్పటివరకు పూనమ్ కౌర్ నుంచి MAA కి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. గతంలో కూడా ఫిర్యాదు వచ్చినట్టుగా రికార్డుల్లో అయితే లేదు. దీనివల్ల ఊరికే డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు..న్యాయం కావాలంటే కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరమైతే ఉంది అంటూ ఆయన చాలా క్లియర్ కట్ గా తెలియజేశాడు…

    ఇక ఇది చూసిన చాలామంది ప్రేక్షకులు సైతం పునమ్ కౌర్ కొద్ది రోజులు కామ్ గా ఉంటుంది. మరికొద్ది రోజులు త్రివిక్రమ్ పైన విరుచుకుపడుతూ ట్వీట్లు చేస్తుంది. దానికి కారణం ఏంటి? ఎందుకని ఆమె అలా కొద్ది రోజులు ఆయన్ని టార్గెట్ చేసి మరికొద్ది రోజులు వదిలిపెడుతుంది. దానిని సాల్వ్ చేసుకొని సైలెంట్ అయిపోవచ్చు కదా మధ్య మధ్యలో ఎందుకి డిస్టబెన్సెస్ అంటూ మరికొంతమంది ప్రేక్షకులు అలాగే సినిమా విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…

    మరి ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ల మీదనే వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ధైర్యం చేసి పోరాటం చేయాలి గాని ట్విట్టర్లలో ట్వీట్ చేస్తే ఎవరికి ప్రయోజనం అయితే ఉండదు. ఇదొక్కటి గమనిస్తే నటినటులే కాదు ఇతర టెక్నీషియన్స్ కూడా వాళ్లకు జరిగిన అన్యాయానికి వాళ్లే ముందుండి పోరాడి న్యాయాన్ని గెలిపించుకోవాలి అంటూ సినిమా జనాలు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…