https://oktelugu.com/

Heroine Trisha : తమిళనాడు ముఖ్యమంత్రి గా హీరోయిన్ త్రిష..? మనసులోని కోరికని బయటపెట్టిన స్టార్ హీరోయిన్!

. ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎమ్మెల్యే స్థాయి నుండి ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె మొదటి అడుగుగా విజయ్ పార్టీ తో తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2025 / 09:21 PM IST

    Trisha

    Follow us on

    Heroine Trisha : తెలుగు, తమిళ భాషల్లో సరిసమానమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది త్రిష కృష్ణన్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె మన తెలుగు ఇండస్ట్రీ కి చెందిన హీరోయిన్, మన తెలుగు అమ్మాయి అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ ఆమె ఒక తమిళియన్. అక్కడే ఆమె తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు లో కూడా అవకాశాలు వచ్చాయి. రెండు భాషల్లోనూ ఈమె సంపాదించినంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా సంపాదించలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి హీరోయిన్స్ ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలియదు కానీ. త్రిష మాత్రం ఒక్కో సినిమాకి 8 నుండి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఎంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా త్రిష క్రేజ్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

    ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ తన మనసులో పలు కోరికలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నాకు మొదటి నుండి రాజకీయాల మీద అమితాసక్తి ఉంది. ప్రజలకు సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఈ స్థాయిలో పెట్టిన జనాలకు ఎదో ఒకటి తిరిగి ఇవ్వాలి. అది జరగాలంటే రాజకీయాలతోనే సాధ్యం. ఎదో ఒకరోజు నాకు తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉంది’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈమె లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా ఎమ్మెల్యే గా పోటీ చేసేలాగానే ఉంది. ప్రస్తుతం ఆమె తమిళ హీరో విజయ్ తో డేటింగ్ లో ఉంది అంటూ కోలీవుడ్ లో ఒక వార్త బాగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.

    వీళ్లిద్దరు ప్రైవేట్ గా కలిసి తిరిగిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. విజయ్ ఈమధ్యనే ‘తమిళగ వెట్రి కజకం’ అనే రాజకీయ పార్టీ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికలకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు భారీ సభని ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించాడు. అయితే త్రిష ఇప్పుడు విజయ్ పార్టీ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేయబోతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలైంది. ముఖ్యమంత్రి అవ్వడమే ద్యేయం అన్న త్రిష , వేరే పార్టీ లో ఎందుకు చేరుతుంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎమ్మెల్యే స్థాయి నుండి ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె మొదటి అడుగుగా విజయ్ పార్టీ తో తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.