Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu Ratika Rose: రాహుల్ సిప్లిగంజ్ రతికా మాజీ లవరా? బ్రేకప్...

Bigg Boss 7 Telugu Ratika Rose: రాహుల్ సిప్లిగంజ్ రతికా మాజీ లవరా? బ్రేకప్ కి నాగార్జునే కారణమా?

ఇక రితికా రోజ్ లవర్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో షాకింగ్ డిటైల్స్ బయటకు వచ్చాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రితికా ఎక్స్ లవర్ అని సమాచారం.

Bigg Boss 7 Telugu Ratika Rose: బిగ్ బాస్ సీజన్ 7లో ఎక్కువ సందడి చేస్తున్న కంటెస్టెంట్ రతికా రోజ్. గత సీజన్లో గీతూ రాయల్ మాదిరి ప్రతి దానికి నేనున్నానని ముందుకు వస్తుంది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి దిల్ ఇచ్చేస్తా అని చెప్పి కాకరేపింది. అలాగే ఎవరినైనా మిస్ అవుతున్నావా అంటే… పేరెంట్స్ కంటే కూడా ఓ వ్యక్తిని బాగా మిస్ అవుతున్నాను. చాలా ఏళ్లుగా మిస్ అవుతున్నాను అని కన్నీరు పెట్టుకుంది. సూచాయిగా తన మాజీ లవర్ గురించి ఆమె ఓపెన్ అయ్యారు. బ్రేకప్ అయ్యిందని వెల్లడించింది.

ఇక రితికా రోజ్ లవర్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో షాకింగ్ డిటైల్స్ బయటకు వచ్చాయి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రితికా ఎక్స్ లవర్ అని సమాచారం. వీరికి చాలా కాలంగా పరిచయం ఉంది. రాహుల్ ప్రొఫెషనల్ సింగర్ గా ఎదగకముందు యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడు. 2019లో ‘హే పిల్లా’ అనే సాంగ్ చేశాడు. ఈ సాంగ్ లో రాహుల్, రితికా రోజ్ నటించారు.

ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అదే ఏడాది రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సీజన్ 3లో పాల్గొన్న ఆయన టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ షో కారణంగానే వీరికి బ్రేకప్ అయ్యిందట. హౌస్లో రాహుల్ సిప్లిగంజ్ హీరోయిన్ పునర్నవి భూపాలంతో రొమాన్స్ చేశాడు. వారి మధ్య సీరియస్ లవ్ స్టోరీ నడిచింది. తెలుగు బిగ్ బాస్ షోలో లవ్ స్టోరీస్ కి బీజం వేసిన జంటగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి నిలిచారు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా కొన్నాళ్లు వాళ్ళ రిలేషన్ సాగింది.

ఈ పరిణామాలతో హర్ట్ అయిన రతికా రోజ్ రాహుల్ కి దూరమైందట. రాహుల్, రతికా రోజ్ విడిపోవడానికి పరోక్షంగా నాగార్జున కూడా కారణమయ్యాడు. రాహుల్, పునర్నవి మధ్య ఏదో జరుగుతుందని మొదట బయటపెట్టింది నాగార్జునే. షోలో ఇలాంటి స్పైసీ కంటెంట్ ఉండాలని తన కామెంట్స్ తో వారిని పరోక్షంగా ఎంకరేజ్ చేశాడు. అందుకే నాగార్జున మీద రతికా రోజ్ కోపంగా ఉంది. ఇటీవల మాటల్లో మాటగా అంతా మీరే చేశారని ఆమె అన్నారు. రతికా, రాహుల్ ఒకప్పటి ప్రేమ వ్యవహారం బయటకు రాగా కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

https://youtu.be/BUNbTJBl1wA?si=oGY0pNIt3UzuegmM

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Oktelugu Epaper