https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ తన డైరెక్టర్లతో ఇంత ఫ్రీ గా ఉంటారా..? అందుకే అతని డార్లింగ్ అని పిలుస్తారా..?

ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను చేస్తున్నాడు. నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 23, 2024 / 12:09 PM IST

    Prabhas(4)

    Follow us on

    Prabhas: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో ప్రభాస్…ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయడమే కాకుండా సూపర్ సక్సెస్ లను కూడా అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన పాన్ ఇండియా సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లనైతే రాబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ లాంటి స్టార్ హీరో తన స్టామినాను పెంచుకుంటూ ముందుకు సాగడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో ముందుకు సాగడమే కాకుండా ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సినిమాలను చేయడమే కాకుండా తనతో సినిమాలు చేసే దర్శకులతో కూడా చాలా జెన్యూన్ గా ఉంటూ ఫ్రెండ్లీగా ఉంటుదనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి బాహుబలి సినిమా తీసే టైమ్ లో రాజమౌళి ప్రభాస్ చాలా జన్యూన్ గా ఉండటమే కాకుండా రాజమౌళితో సమయం దొరికిన ప్రతిసారి కామెడీ చేస్తూ ఉండేవాడు. అలాగే ఇప్పుడు సినిమాలు చేస్తున్న హను రాఘవ పూడి సందీప్ రెడ్డి లతో చాలా క్లోజ్ గా ఉంటూ ఫన్నీ కన్వర్జేషన్ జరుపుతూ ఉంటాడు. ఇక నిజానికి రాజమౌళి ప్రశాంత్ నీల్ తో ఎలా ఉంటాడో ఇప్పుడు హను రాఘవ పూడి మారుతి లాంటి దర్శకులతో కూడా ఆయన అలాగే ఉండడం అనేది నిజంగానే ఆయన గొప్పతనం అనే చెప్పాలి.

    ఇప్పుడున్న వాళ్లలో చాలామంది హీరోలకి మేమే గొప్ప అనే ఒక ఇగో అయితే ఉంటుంది. కానీ ప్రభాస్ కి మాత్రం అలాంటిది ఏదీ లేకుండా చాలా జెన్యూన్ గా ఉంటూ అందరితో చాలా కలివిడిగా కలిసిపోతూ ఉంటాడు. ఒక సినిమా ప్రేక్షకుడికి చేరుకోవాలంటే అది ఆ హీరో వల్లనే సాధ్యం అవుతుంది. ఇక ఆ సినిమా స్టాండర్డ్ అనేది కూడా హీరోల మీదనే ఆధారపడి ఉంటుంది.

    చిన్న హీరోల సినిమాకి ఒక బడ్జెట్ ఉంటే పెద్ద హీరోల సినిమాలకు మరొక బడ్జెట్ ఉంటుంది. ఇదంతా కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇక అలాంటి సమయంలో సినిమా మొత్తాన్ని తన మీదే వేసుకొని ముందుకెళ్లే హీరోలకు సాధారణంగా ఈగో అయితే ఎక్కువగా ఉంటుంది.

    తనమాటే అందరు వినాలని తను చెప్పిందే నడవాలి అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంటాడు. ఇక దర్శకుడు ఏం చెప్తే అది ఫాలో అయిపోతూ ముందుకు సాగుతూ ఉంటాడు. అలాగే సినిమాకి పని చేసే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ తో కూడా ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళ పేర్లుతో సహా పిలిచేంత ఫ్రీడం తో ప్రభాస్ ఉంటాడు…అందుకే ఆయన్ని అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు…