CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల్లోనూ పెద్దగా వ్యతిరేకత లేదు. పది నెలల రేవంత్ పాలనపై అన్నివర్గాలు సంతృప్తిగానే ఉన్నాయి. అయితే ఇటీవల రేవంత్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే హైడ్రాను విపక్షాలు టార్గెట్ చేశాయి. మరోవైపు తాజాగ కేటీఆర్ సీఎం రేవంత్ టార్గెట్‌గా అవినీతి ఆరోపణలు చేశారు. ప్రతీ పథకంలోనూ, ప్రతీ కాంట్రాక్టులోనూ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఇద్దరు మంత్రులు సీఎం రేవంత్ టార్గెట్‌గా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రులతో రేవంత్‌కు ముప్పు తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఒక మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని తెలుస్తోంది. రేవంత్‌ను గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అధిష్టానం అపాయింట్‌మెంట్..
ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి సీఎం రేవంత్ తన వెంట భట్టి లేదా శ్రీధర్‌బాబును తీసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ మంత్రి ఉత్తమ్ మాత్రం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్తున్నారు. అధిష్టానాన్ని కలుస్తున్నారు. అధిష్టానం కూడా ఉత్తమ్‌కు ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉత్తమ్.. రేవంత్ తప్పిదాలను అధిష్టానం పెద్దలకు తెలియజేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అనుకూల రాజకీయలు చేస్తున్నారన్న ప్రధాన ఫిర్యాదు చేశారని సమాచారం. తాను ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతోనే ఉత్తమ్ రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా ఆయన సీఎం లేదా డిప్యూటీ సీఎం కోసం ప్రయత్నించారు.
తాజాగా అవినీతి ఆరోపణలు..
ఇదిలా ఉంటే.. తాజాగా అమృత్ టెండర్ల విషయంలో భారీ స్కాం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డే ఇందుకు ప్రధాన కారణమని ఆరోపించారు. 9 వేల కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ కుటుంబం పాల్పడిందని తెలిపారు. అమృత్ టెండర్లు రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి దక్కాయని ఆరోపించారు
పొంగులేటి కూడా..
ఇదిలా ఉంటే.. పొంగులేటి కూడా రేవంత్‌ను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. అమృత్ టెండర్ల విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణల విషయంలో స్పందించిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎంను ఇరికించేలా ఉన్నాయి. సృజన్‌రెడ్డి అసలు సీఎం బావమరిది కాదని తెలిపారు. కానీ, సృజన్‌రెడ్డి సీఎం బావమరిదే. కావాలనే పొంగులేని మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యడ్యూరప్ప, అశోక్ చౌహాన్ తరహాలో రేవంత్‌రెడ్డి సీఎం పదవి కల్పోతారని కేటీఆర్ బాంబు పేల్చారు. అన్నట్లుగానే ఉత్తమ్, పొంగులేటి వెనుక గోయి తవ్వుతున్నట్లు తెలుస్తోంది.