Bigg Boss 8 Telugu: నిన్న జరిగిన ఎపిసోడ్ తో అభయ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా మంది బిగ్ బాస్ ని అభయ్ అడ్డమైన బూతులు తిట్టడం వల్ల ఎలిమినేట్ అయ్యాడని అనుకుంటున్నారు కానీ, ఆయనకీ అందరికంటే తక్కువ ఓటింగ్ రావడం వల్లనే ఎలిమినేట్ అయ్యాడు అనేది నూటికి నూరు శాతం నిజం. ఎందుకంటే సోషల్ మీడియా లో ఏ పోల్ తీసుకున్నా అందరికంటే తక్కువ ఓటింగ్ అభయ్ కి మాత్రమే వచ్చింది. బిగ్ బాస్ లో ఎలిమినేషన్స్ కోసం మనం ఆదివారం వరకు వేచి చూడాల్సిన పని లేదు, మధ్యలోనే సోషల్ మీడియా ఓటింగ్ ద్వారా తెలిసిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్ లో ఎలిమినేషన్స్ సోషల్ మీడియా ఓటింగ్ కి దగ్గరగా ఉన్నవే. ఇదంతా పక్కన పెడితే అభయ్ ఎలిమినేట్ అవ్వగానే బిగ్ బాస్ బజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత ఆయన మొదటి వారం, రెండవ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బెజవాడ బేబక్క, శేఖర్ బాషా తో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన బిగ్ బాస్ హౌస్ లో తనకి ఎదురైనా సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. సోనియా వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతుంది హౌస్ లో ఉన్నప్పుడు మీకు కూడా అనిపించిందా అని అభయ్ ని యాంకర్ అడగగా, దానికి అభయ్ సమాధానం చెప్తూ ‘నిఖిల్ తో కూడా నేను చాలా సార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. సోనియా నిఖిల్ ని ప్రభావితం ఉద్దేశపూర్వకంగానే చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, నాకు అనిపించింది ఆయనకు చెప్పాను. చూసేవాళ్లకు ఎవరికైనా కానీ సోనియా నిన్ను తన గేమ్ కోసం వాడుకుంటుంది, నిన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనే అనిపిస్తుంది. ఇది జనాల్లోకి చాలా గలీజ్ గా వెళ్లే అవకాశం ఉంది అని చెప్పాను. వాడు కూడా నిజమే మామా, ఈ విషయం తనకి అర్థం అయ్యేలా చెప్పాలి అని అనే వాడు. నిఖిల్ సంగతి కాసేపు అటు ఉంచితే, పృథ్వీ ని తన చేతిలో ఉన్న ఒక ఆయుధం లాగా వాడుకుంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అప్పుడు బెజవాడ బేబక్క సోనియా నిఖిల్ తో మాట్లాడిన ఒక మాటని గుర్తు చేస్తూ ‘నువ్వు సిగరెట్లు మానేయ్ రా.. ఏది అడిగితె అది ఇస్తాను’ అని సోషల్ మీడియా లో వైరల్ అయిన వీడియో గురించి చెప్పుకొచ్చింది. ఇది విన్న అభయ్ ‘వామ్మో!..అవునా, ఈ విషయం నాకు తెలియదు..ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను చూడలేక దూరం వెళ్ళిపోతూ ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు అభయ్ నిఖిల్. పదేళ్ల నుండి స్నేహం చేస్తున్నప్పటికీ కూడా సోనియా గురించి అభయ్ నిర్మొహమాటంగా నిజానిజాలు మాట్లాడడం పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
After This Interview My Respect Has Increased On #AbhaiNaveen
Snekiya 10 yrs Friend Ayina Sare Direct Cheppesadu Avide Chala wrong Sofa Game Aduthundi Ani #SehkarBasha Highlight Gunde Dhairyam Penchuthundi #BiggBossTelugu8pic.twitter.com/KFBXQqSP7a
— BiggBossTelugu8 (@Boss8Telugu) September 23, 2024