Nagarjuna better than Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా ఎక్కువైపోయింది. ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధిస్తూ స్టార్ హీరోలతో పాటు దీటుగా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే బాలయ్య బాబు వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. ఇప్పుడు బోయపాటి డైరెక్షన్లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతుండటం విశేషం… ఇక డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక మరో సీనియర్ హీరో అయిన నాగార్జున సైతం ప్రస్తుతం ప్రేక్షకులను అలరించడానికి తన వందో సినిమాలతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన కొన్ని సినిమాలు అతను ఆశించిన మేరకు విజయాలను సాధించలేదు…
దాంతో ఆయన తన 100 వ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక ఇద్దరు సీనియర్ హీరోలు వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక విషయంలో బాలకృష్ణ కంటే నాగార్జున ముందు వరుసలో ఉన్నాడు. బాలయ్య నాగార్జునను చూసి నేర్చుకోవాలి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…
డబ్బులను ఎలా సేవ్ చేయాలి అలాగే డబ్బులను ఎలాంటి బిజినెస్ ల మీద కేటాయించి దాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద నాగార్జునకున్న క్లారిటీ బాలకృష్ణ కైతే లేదు. మొత్తానికైతే నాగార్జున తన రెమ్యునరేషన్ ను ఏదో ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ బాలకృష్ణ మాత్రం బిజినెస్ మీద పెద్దగా ఫోకస్ చేయడు. అటు హీరోగా సినిమాలు చేస్తూనే ఇటు ఎమ్మెల్యేగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ బాలకృష్ణ చాలా బిజీగా ఉంటాడు.
కాబట్టి అతనికి బిజినెస్ ల మీద సమయాన్ని కేటాయించెంత అవకాశం లేదు. కాబట్టే అతను బిజినెస్ లకు దూరంగా ఉంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి… కానీ బాలయ్య బాబు అభిమానులు మాత్రం నాగార్జున ను చూసి బాలకృష్ణ బిజినెస్ ఎలా చేయాలనేది నేర్చుకోవాలని చెబుతుండటం విశేషం…