Ram Charan – Mahesh Babu Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మల్టీస్టారర్ల హవా ఎక్కువైపోయింది. రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో మల్టీ స్టారర్ సినిమా రావడంతో ఇప్పుడు ప్రతి ఒక్క దర్శకుడి చూపు మల్టీ స్టారర్ సినిమాల వైపే సాగుతోంది. దానికోసమే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కథలనే రాసుకుంటున్నారు. దాని ద్వారా ప్రేక్షకులకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు సైతం ఆనందపడతారని అలాగే ఫ్యాన్ వార్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఇలాంటి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది. ‘త్రిబుల్ ఆర్’ తర్వాత రామ్ చరణ్ – మహేష్ బాబు లతో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. వాళ్లిద్దరికి కథను కూడా వినిపించాడు. అయినప్పటికి ఇద్దరు మధ్య సరైన కాన్ఫ్లిక్ట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే అది వర్కౌట్ అయితే మాత్రం దేవర సినిమా తర్వాత ఆ సినిమాని పట్టాలెక్కించాలని కొరటాల శివ ప్రయత్నం చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు…
ప్రస్తుతం కొరటాల శివ ‘దేవర 2’ సినిమా మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో కొరటాల ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక దేవర సినిమా ప్రేక్షకులను మెప్పించింది.
Also Read: లైవ్ లో సైట్ లను హ్యాక్ చేసి చూపించిన ‘ఐ బొమ్మ రవి’…షాకైన జడ్జ్…వైరల్ వీడియో…
కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కాబట్టి ‘దేవర 2’ సినిమా అయిన సరే సక్సెస్ అందుకుంటే చూడాలని ప్రతి ఒక్కరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన కూడా కొరటాల శివకు వరుసగా సూపర్ హిట్లను సాధించిన చరిత్ర ఉంది. అయినప్పటికి ఆయనకి ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలెవరు డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏదైనా కూడా తొందరలోనే కొరటాల తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదనే చెప్పాలి…