Soundarya: 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సౌందర్య. ఆమె మొదట కన్నడ చిత్రంలో నటించింది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆమెకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు సూపర్ హిట్ కొట్టాయి. దాంతో సౌందర్య వెలుగులోకి వచ్చింది. తెలుగు ఆడియన్స్ ఆమెను వోన్ చేసుకున్నారు. సౌందర్యను ఎంతగానో ఆదరించారు. మిగతా భాషలతో పోల్చితే సౌందర్యకు తెలుగులో ఫేమ్ ఎక్కువ.
చాలా చిన్న వయసులో సౌందర్య పరిశ్రమకు వచ్చారు. స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయం తీసుకోవడం, విపరీత పరిణామాలకు దారి తీసింది. సౌందర్య బీజేపీ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు. బెంగుళూరు నుండి కరీంనగర్ కి వెళ్లే క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు. సౌందర్య తో పాటు ఆమె బ్రదర్ సైతం అదే ప్రమాదంలో మరణించాడు.
కాగా ఆ సమయంలో సౌందర్య మోహన్ బాబుకు జంటగా ఓ చిత్రం చేస్తుంది. శివ శంకర్ ఆ మూవీ టైటిల్. ఈ చిత్ర దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఓ ఆసక్తికర సంగతి బయటపెట్టాడు. ఈ చిత్రానికి నిర్మాత మోహన్ బాబే. ఆయన ఎవరికీ సెలవులు ఇచ్చేవాడు కాదట. సౌందర్యకు మాత్రం బీజేపీ పార్టీ ప్రచార సభల్లో పాల్గొనేందుకు ఆయన అనుమతులు ఇచ్చాడట. ఒకవేళ సౌందర్యకు మోహన్ బాబు సెలవులు ఇవ్వకపోతే.. ఆమె మరణించేవారు కాదు. బీజేపీ పార్టీ ప్రచార సభల్లో పాల్గొనేవారు కాదని.. కాపుగంటి రాజేంద్ర అన్నారు.
సౌందర్య మరణం అనంతరం శివ శంకర్ విడుదలైంది. సినిమా మాత్రం ఆడలేదు. కాగా సౌందర్య మరణం కారణంగా బాలకృష్ణ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైతం నిలిచిపోయింది. పౌరాణిక చిత్రం నర్తనశాల బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. ఆ మూవీలో సౌందర్య ద్రౌపది రోల్ చేస్తున్నారు. కొంత షూటింగ్ జరిగాక సౌందర్య కన్నుమూసింది. దాంతో సౌందర్య కాకుండా ద్రౌపది రోల్ మరొకరు చేయలేరని బాలకృష్ణ నమ్మారు. అందుకే ఆమె మరణంతో ప్రాజెక్ట్ ఆపేశాడు.
ఇటీవల నర్తనశాల మూవీని షూటిం చేసినంత వరకు ఓటీటీలో విడుదల చేశారు. శ్రీకాంత్, శరత్ బాబు వంటి నటులు ఈ చిత్రంలో కీలక రోల్ చేశారు. సౌందర్య చివరి చిత్రం మాత్రం శివ శంకర్ అని చెప్పొచ్చు. సౌందర్యకు ఒకరి భార్యగా హోమ్లీ లైఫ్ అనుభవించాలని ఉండేదట. ఆ కోరిక నెరవేరకుండానే ఆమె మరణించారు. పెళ్లైన ఏడాది లోపే సౌందర్య ప్రమాదంలో మరణించింది. అప్పటికి సౌందర్య వయసు కేవలం 27 ఏళ్ళు మాత్రమే.