Ind Vs NZ 1st Test: ఈ దశలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు దూకుడుగా ఆడుతోంది. నాలుగు రోజు వర్షం అంతరాయం కలిగించే నాటికి మూడు వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది.. సర్ఫరాజ్ ఖాన్ (125*) రన్స్ చేశాడు. రిషబ్ పంత్ (53) తో కలిసి నాలుగో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో టీమిండియా ప్రస్తుతానికి న్యూజిలాండ్ స్కోర్ తో పోలిస్తే 12 పరుగుల దూరంలో ఉంది. అయితే ఈలోపు అనుకోకుండా వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అయితే నాలుగో రోజు ఆటలో టీమిండియా కు ముఖ్యంగా రిషబ్ పంత్ కు పెను ప్రమాదం తప్పింది. సర్ఫరాజ్ ఖాన్ అప్రమత్తం కావడంతో రిషబ్ పంత్ ఔట్ కాకుండా తప్పించుకున్నాడు. అయితే రిషబ్ ను కాపాడేందుకు సర్ఫరాజ్ మైదానంపై డ్యాన్సులు చేశాడు. పిచ్చిపిచ్చిగా గంతులు వేశాడు. గట్టిగా అరిచాడు. దీంతో న్యూజిలాండ్ కీపర్ టామ్ బ్లండల్ ఒక్కసారిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. రిషబ్ పంత్ ను రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫలితంగా భారత జట్టుకు జీవదానం లభించింది. ఆ సమయంలో రిషబ్ పంత్ ఆరు పరుగులు మాత్రమే చేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే…
టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 56 ఓవర్ వేయడానికి మాట్ హెన్రీ వచ్చాడు. అప్పుడు స్ట్రైకర్ గా సర్ఫరాజ్ ఉన్నాడు. హెన్రీ వేసిన ఓ బంతిని గల్లీ వైపుకు ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. మొదటి పరుగును సులభంగాన్ని తీయగలిగారు. ఆ తర్వాత రెండవ పరుగు తీసేందుకు ప్రయత్నిస్తుండగా బంతిని కాన్వే పట్టుకున్నాడు. దీంతో రెండవ పరుగు తీయడం సాధ్యం కాదని సర్ఫరాజ్ అంచనా వేశాడు. ఈ పరిస్థితిలో పంత్ ను రావద్దని సూచించాడు. అయితే అతడు ఆ మాట వినకపోవడం.. పైగా వేగంగా పరుగు తీయాలని సగం పిచ్ వద్దకు వచ్చాడు. అయితే అతడిని ఎలాగైనా వెనక్కి పంపించాలని సర్ఫరాజ్ పిచ్ మధ్యలో దుంకుతూ.. డ్యాన్స్ వేస్తూ.. దగ్గరగా అరిచాడు. దీంతో పంత్ వెనక్కి వెళ్ళాడు. కాన్వే అప్పటికే బంతిని కచ్చితంగా కీపర్ బ్లండెల్ వైపు విసిరేశాడు. అయితే అప్పటికే పంత్ వేగంగా క్రీజ్ లోకి తిరిగి వచ్చాడు. దీంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీ తో టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. సర్ఫరాజ్ కు అండగా నిలిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 113 పరుగులు జోడించారు..కాగా, పంత్ తన మాట వినకపోవడంతో సర్పరాజ్ కు కోపం వచ్చింది..”పరుగు తీస్తున్నప్పుడు నేను వద్దని చెబుతున్నాను. అది రన్ అవుట్ అయ్యే ప్రమాదం. పరిగెత్తడమే కాదు.. నా వైపు కూడా గట్టిగా చూడు” అన్నట్టుగా సర్పరాజ్ కంటి సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. రన్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. వన్డే తరహాలో బ్యాట్ ఝుళిపించాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ టీమిడియాపై ఒత్తిడి తగ్గించాడు. సెంచరీ చేసిన సర్పరాజ్ ను అభినందిస్తూనే.. పంత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని.. సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.
That little dance from sarfaraz in the pitch#INDvsNZ #SarfarazKhan #RishabhPant pic.twitter.com/EAsqF1uCEM
— (@ShakthiRamesh1) October 19, 2024