Homeఅంతర్జాతీయంUAE Visa: దుబాయ్, యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక మరింత ఈజీగా...

UAE Visa: దుబాయ్, యూఏఈ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక మరింత ఈజీగా…

UAE Visa: యూఏఈ, దుబాయ్‌ వెళ్లాలనుకుంటున్నారా.. వీసా లేదా.. అయినా ఇక మీరు ఆ దేశాలకు వెళ్లొచ్చు. భారత్‌లో వీసా తీసుకోకపోయినా యూఏఈ లేదా దుబాయ్‌లో దిగిన తర్వాత కూడా పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. అర్హత కలిగిన భారతీయ ప్రయాణికులు ఈ వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని యూఏఈవోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. యూఏఈ ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అక్కడ ఉండేందకు 14 రోజుల వీసా పొందే వీలు ఉంటుంది.

ఏటా వేలా దిమంది..
భారత్‌ నుంచి ఏటా వేలాది మంది దుబాయ్, యూఏఈకి వెళ్తుంటారు. కొందరు చదువు కోసం, కొందరు ఉద్యోగాలు, ఉపాధి కోసం మరికొందరు విహార యాత్ర కోసం వెళ్తుంటారు. కొందరు అక్కడే స్థిరపడతారు. వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వెళ్లొస్తుంటారు. ఇలాంటివారు పాస్‌పోర్టు, వీసా కలిగి ఉండాలి. అయితే తాత్కాలికంగా యూఏఈ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి భారత ఎంబసీ అక్కడే వీసా తీసుకునే అవకాశం కల్పించింది.

ఎయిర్‌ పోర్టులో వీసా…
యూఏఈ వెళ్లే భారతీయులు అక్కడి ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే వీసా జారీ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీనికోసం వీసా ఆన్‌ అరైవల్‌ను యూఏఈ అందుబాటులోకి తెచ్చింది. దీంతో అర్హులు 14 రోజుల గడువుతో వీసా పొందే అవకాశం ఉంది. అయితే ఈ వీసా ఆన్‌ అరైవల్‌ అందరికీ వర్తించదని తెలిపింది. అర్హులు మాత్రమే పొందే వీలుంటుంది.

వీరు అర్హులు..
అమెరికా జారీ చేసిన గ్రీన్‌కార్డు లేదా యూఏఈలో చెల్లుబాటు అయ్యే వీసా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఇచ్చే రెసిడెన్స్‌ లేదా యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్, వీసాలు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ వీసా పొందవచ్చని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. కనీంస ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే పాస్ట్‌పోర్టు ఉండేలా చూసుకోవాలని వెల్లడించింది. అయితే వీసా ఆన్‌ అరైవల్‌ కింద మొదట 14 రోజులు వ్యవధితో వీసా అందిస్తారు. పరిస్థితిని బట్టి దానిని మరో 14 రోజులు పొడిగిస్తారు. ఒకవేళ పొడిగింపు వీలుకాని 60 రోజుల వ్యవధితో కూడిన వీసా కూఆ తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version